NTV Telugu Site icon

Tunivu: అజిత్ ఫ్యాన్స్ మేల్కోండి.. ప్రమోషన్స్ మొదలయ్యాయి

Ajith

Ajith

Tunivu: కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ హీరోగా నటిస్తున్న చిత్రం తునీవు. హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ ను బోనీ కపూర్ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో అజిత్ సరసన మంజు వారియర్ నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజయ్యిన పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. సంక్రాంతి కానుకగా ఈ సినిమా అన్ని భాషల్లో రిలీజ్ కానుంది. ఇక విజయ్- అజిత్ మధ్య సంక్రాంతికి గట్టి పోటీ జరగనున్న విషయం విదితమే.

ఇప్పటికే వరిసు ప్రమోషన్స్ మొదలుపెట్టేశాడు విజయ్. ఇక అజిత్ ఎప్పుడు ప్రమోషన్స్ మొదలుపెడతాడా..? అని ఎదురుచూస్తుండగా మేకస్ర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా నుంచి మొదటి సింగిల్ రిలీజ్ చేయడానికి మేకర్స్ ముహూర్తం ఖరారు చేశారు. చిల్లా చిల్లా అంటూ సాగే సాంగ్ ను డిసెంబర్ 9 న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఇకపోతే ఈ సినిమాకు జీబ్రాన్ మ్యూజిక్ ను అందించాడు. మరి ఈ సాంగ్ ఎలా ఉండబోతుందో చూడాలంటే ఇంకో నాలుగు రోజులు ఆగాల్సిందే.