NTV Telugu Site icon

VidaaMuyarchi : ‘కింగ్ ఆఫ్ కలెక్షన్స్’కు కేరాఫ్ అడ్రెస్ అజిత్ కుమార్..

Ak

Ak

తమిళ స్టార్ హీరో అజిత్‌ కుమార్ సినిమా రిలీజ్ అంటే తమిళనాడులో జరిగే హంగామా అంతా ఇంతా కాదు. థియేటర్స్ వద్ద ఫ్యాన్స్ రచ్చ ఓ రకమైన జాతరను తలిపిస్తుంది. ప్రస్తుతం మాగిజ్‌ తిరుమేని దర్శకత్వంలో ‘విదాముయార్చి’ అనే  సినిమాలో నటిస్తున్నాడు అజిత్ కుమార్. భారీ బడ్జెట్ సినిమాల నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించింది. త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా అర్జున్, రెజీనా తదితరులు కీలక పాత్రలు కనిపించనున్నారు. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్ర టీజర్‌కు విశేష స్పందన లభించింది.

Also Read : SSMB 29 : రాజమౌళి – మహేశ్ సినిమాలో విలన్ గా బాలీవుడ్ బ్యూటీ.?

ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ఫిబ్రవరి 6న రిలీజ్ కానుంది.  దాదాపుగా 2700 షోస్ తో రిలీజ్ అవుతున్న విదాముయార్చి తమిళనాడు అడ్వాన్స్ బుకింగ్స్ ప్రస్తుతం రూ. 25 కోట్లు దాటి పరుగులు పెడుతుంది. ఊహించిన దాని కంటే ఎక్కువగా విదాముయార్చి బుకింగ్స్ కొల్లగొడుతుంది. ప్రమోషన్స్ వీక్ గా ఉన్న కూడా బుకింగ్స్ పీక్స్ లో ఉండడానికి అజిత్ కుమార్ పేరు మాత్రమే కారణం అని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అజిత్ కుమార్ ఫ్యాన్స్ మరోసారి మాస్ పవర్ చూపిస్తున్నారు. నేడు అడ్వాన్స్ సేల్స్ మరింత పెరిగి అటు ఇటుగా రూ. 27  నుండి 28 కోట్లు రేంజ్ లో ఉండే అవకాశాలు ఉన్నాయి. సినిమా టాక్ ఏ మాత్రం బాగుంది అనే టాక్ వచ్చిన ఆల్ టైమ్ రికార్డ్స్ సెట్ చేసే ఛాన్స్ ఉంది. అనిరుధ్ సంగీతం సంగీతం అందిస్తున్న ఈ సినిమాను దర్శకుడు మాగిజ్ తిరుమనేని ఔట్ అండ్ ఔట్ యాక్షన్ సినిమాగా తెరకెక్కిస్తున్నాడు.