NTV Telugu Site icon

Ajith : కేరళ టెంపుల్ లో స్టార్ హీరో ప్రత్యేక పూజలు

Ajith

దక్షిణాదిన అత్యంత ప్రజాదరణ పొందిన నటుల్లో అజిత్ కుమార్ ఒకరు. ఆయన అసలు సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేకపోయినా, అజిత్ యూ సంబంధించి ఎప్పుడూ ఏదో ఒక వార్త నెట్టింట్లో వైరల్ అవుతుంది. తాజాగా అజిత్ సాంప్రదాయ దుస్తువుల్లో మెరిసిపోతున్న కొన్ని ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అజిత్ తాజాగా కేరళలోని ఓ ఆలయాన్ని సందర్శించి, అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారట. వైరల్ అవుతున్న ఫొటోల్లో అజిత్ తెల్లటి గడ్డంతో తెల్లటి సాంప్రదాయ దుస్తులు ధరించి కన్పిస్తున్నారు. అంతేకాదు ఆ ఫోటోలలో దేవుడికి అజిత్ హారతి ఇవ్వడం కూడా కన్పిస్తోంది. అయితే అజిత్ పూజలు చేసిన ఆలయం ఏంటన్నది మాత్రం తెలియరాలేదు.

Read Also : Tirumala : శ్రీవారి సన్నిధిలో టాలీవుడ్ ప్రముఖులు

ఇక అజిత్ సినిమాల విషయానికొస్తే… అజిత్ కుమార్ ఇటీవలే “వలిమై” అంటూ అన్ని భాషల్లోనూ ప్రేక్షకులను అలరించారు. ముఖ్యంగా ఈ సినిమాకు తమిళంలో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ స్టార్ హీరో మరో సినిమాతో బిజీగా ఉన్నాడు. బ్లాక్‌బస్టర్ త్రయంగా పేరు తెచ్చుకున్న అజిత్, హెచ్ వినోద్, బోనీ కపూర్‌ ల కాంబోలో మరో సినిమా రూపొందనుంది. ఈ చిత్రానికి తాత్కాలికంగా “అజిత్ 61” అని పేరు పెట్టారు. ఈ సినిమా తర్వాత అజిత్ తన నెక్స్ట్ మూవీని దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో చేయనున్నట్టు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. AK62 వర్కింగ్ టైటిల్ తో పిలుచుకుంటున్న ఈ సినిమాలో నయనతార కథానాయికగా నటిస్తుండగా, అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారని సమాచారం. అయితే దీనికి సంబంధించి అధికారిక ధృవీకరణ ఇంకా వెలువడాల్సి ఉంది.