Site icon NTV Telugu

Ajith : 33 ఏళ్ల తన సినీ ప్రయాణం‌పై.. అజిత్ ఎమోషనల్ పోస్ట్

Ajith Kumar

Ajith Kumar

తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్.. సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టి, నేటితో 33 సంవత్సరాలు పూర్తయింది. దీంతో ఆయనకు అభిమానుల నుంచి, సినీ ప్రముఖుల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా తన అభిమానులకు ఒక హృదయాన్ని తాకే భావోద్వేగ లేఖ షేర్ చేశారు. ఈ లేఖలో ఆయన తాను ఎదుర్కొన్న కష్టాలు, పరాజయాలు, మానసిక ఒత్తిడులు, అభిమానుల అండ, కుటుంబం మద్దతు గురించి చక్కగా వివరించారు.

Also Read : Tamannaah : తమన్నా చెప్పిన లాలాజల చిట్కా‌పై హాట్ డిబేట్ – డాక్టర్లు ఏం చెబుతున్నారంటే..?

“నా సినీ జీవితం ఒక్కరోజూ సాఫీగా సాగలేదు. నాకు ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేదు. ఈ స్థాయికి చేరుకోవడం అంత సులభం కాదు. ఎన్నో వైఫల్యాలు, ఒత్తిడులు ఎదురైనా, నేనెప్పుడూ వెనక్కి త‌గ్గలేదు. కెరీర్‌లో ఊహించలేని పరాజయాలను ఎదుర్కొన్నా, తన వెంట ఉన్న అభిమానుల ప్రేమే తనను నిలబెట్టింది. మోటార్ రేసింగ్‌లోనూ ఎన్నో గాయాలు జరిగాయి, కొంతమంది నేను ఎదగకుండా ఆపాలని ప్రయత్నించారు. అయినా ధైర్యంగా ముందుకు సాగి, ఊహించిన స్థాయికి ఎదిగా. ఈ ప్రయాణంలో నా జీవిత భాగస్వామి షాలిని తనకు వెన్నెముక‌గా నిలిచింది, ఆమె లేకపోతే ఇవన్నీ సాధ్యమయ్యేవి కావు. నేను ఎక్కువ సినిమాలు తీయకపోవచ్చు, కానీ మీ ప్రేమను ప్రతి క్షణం ఆస్వాదిస్తాను. నా లోపాలను కూడా అంగీకరించిన మీరు నిజంగా గొప్పవారు. విమర్శకులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు.. ఎందుకంటే విమర్శలే నాకు స్పూర్తినిచ్చా‌యి’ అంటూ అజిత్ ఎమెషనల్ లేటర్ వైరల్ అవుతుంది. మొత్తానికి, అజిత్ సినీ ప్రయాణం కేవలం ఒక నటుడి కథ కాదు. సక్సేస్‌కి నిలువెత్తు నిదర్శనం.

Exit mobile version