Ajey-The Untold Story of a Yogi: మన దేశంలో పలువురు రాజకీయ నేతలు, క్రీడాకారుల జీవిత నేపథ్యం ఆధారంగా ఎన్నో సినిమాలు వచ్చాయి. మరో రాజకీయ నాయకుడి జీవిత చరిత్ర ఆధారంగా మరో సినిమా తెరకెక్కింది. ఉత్తర్ ప్రదేశ్ సీఎం, బీజేపీ నేత యోగి ఆదిత్యనాథ్ జీవితం ఆధారంగా ‘‘అజయ్: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ ఎ యోగి’’ అనే టైటిల్ తో సినిమా రూపొందించేందుకు రంగం సిద్ధమైంది. శంతను గుప్తా రాసిన ‘‘ది మాంక్ హు బికమ్ చీఫ్ మినిస్టర్’’ పుస్తకం ఆధారంగా సినిమా రూపొందించబడింది. సినిమాపై అనౌన్స్‌మెంట్‌తో పాటు మోషన్ పోస్టర్ కూడా విడుదల చేశారు.
Read Also: Yogi Adityanath: ‘‘మసీదుల్ని స్వాధీనం చేసుకుని బీజేపీ ఏం చేస్తుంది’’.. యోగి సమాధానం ఇదే..
యోగి ఆదిత్యనాథ్ పాత్రను యాక్టర్ అనంత్ జోషి పోషించారు. మహారాణి 2 ఫేమ్ రవీంద్ర గౌతమ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో దినేష్ లాల్ యాదవ్ అజయ్ మెంగి, పవర్ మల్హోత్రా, రాజేష్ ఖట్టర్, గరిమా విక్రాంత్ సింగ్, సర్వర్ అహుజా నటించారు. యోగి అసలు పేరు అజయ్ సింగ్ బిష్త్ పేరు ఆధారంగా సినిమా పేరు పెట్టారు. 2025లో ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. హిందీ, తెలుగు, తమిళం , కన్నడ, మలయాళ భాషల్లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. దర్శకుడు రవీంద్ర గౌతమ్ మాట్లాడుతూ.. మా సినిమా దేశ యువతకు చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటుందని, భారతదేశంలో అత్యంత జనాభా కలిగిన రాష్ట్రానికి సీఎంగా ఎదిగిన ఉత్తరాఖండ్‌లోని మారుమూల గ్రామానికి చెందిన వ్యక్తి గురించి సినిమాలో చూపిస్తామని అన్నారు.