Site icon NTV Telugu

Ajay Ghosh : ఓజి సినిమాలో నా పాత్ర అలా ఉండబోతుంది..

Whatsapp Image 2023 09 02 At 2.41.52 Pm

Whatsapp Image 2023 09 02 At 2.41.52 Pm

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఓజీ’ (OG).టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈరోజు పవన్ కల్యాణ్ బర్త్ డే కానుకగా అభిమానుల కోసం ‘ఓజీ’ సినిమా నుంచి తాజాగా వీడియో గ్లింప్స్‌ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.’పదేళ్ల క్రితం బాంబేలో వచ్చిన తుపాన్ గుర్తుందా. అది మట్టి, చెట్లతో పాటు సగం ఊరినే మింగేసింది. కానీ వాడు నరికిన మనుషుల రక్తాన్ని మాత్రం ఇప్పటికి ఏ తుపాన్ కడగకలేకపోయింది. అలాంటోడు మళ్లీ తిరిగివస్తున్నాడంటే..’ అంటూ దాదాపు 101 సెకన్ల నిడివితో కూడిన గ్లింప్స్ అర్జున్ దాస్  పవర్ ఫుల్ వాయిస్ ఓవర్‌తో విడుదలైంది. పవన్‌ కళ్యాణ్ కు బర్త్డే విషెస్‌ చెబుతూ విడుదల చేసిన ఈ గ్లింప్స్‌ ఫ్యాన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటోంది.ఈ గ్లింప్స్ లో పవన్‌ కళ్యాణ్ లుక్స్‌, డైలాగ్‌తో ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్‌ అందించారు మేకర్స్… ఈ చిత్రంలో పవన్‌ కళ్యాణ్ సరసన ప్రియాంక అరుళ్‌ మోహన్‌ హీరోయిన్ గా నటించనుంది.

ప్రస్తుతం ఓజి సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ పవర్ ఫుల్ గ్యాంగ్‌స్టర్‌గా స్టయిలిష్ లుక్‌లో సరికొత్తగా కనిపిస్తున్నారు..తాజాగా ఈ చిత్రంలో నటిస్తున్న నటుడు అజయ్ ఘోష్ ఓజి సినిమాలో తన పాత్ర ఎలా ఉంటుందో చెప్పుకొచ్చారు.అజయ్ ఘోష్ మాట్లాడుతూ…ఓజీ చిత్రంలో తాను ఒక రిటైర్డ్ గ్యాంగ్ స్టర్ గా కనిపించనున్నట్లు ఆయన చెప్పారు. అలాగే తనతో పాటు మొట్టై రాజేంద్ర, జీవా వంటివారు కూడా కనిపిస్తారని తెలిపారు.తాము రిటైర్ అయ్యి ఇప్పుడు ఫామ్ లో లేకపోయినా ఎంతగానో బిల్డప్ ఇస్తూ ఎంతగానో నవ్విస్తామని ఆయన తెలిపారు.. అలాగే కొద్దిగా విలినిజం కూడా ఉంటుందని ఆయన తెలిపారు..ఆయనకు పవన్ కళ్యాణ్ తో కొన్ని సీన్స్ కూడా ఉన్నాయని ఆయన తెలిపారు.ప్రస్తుతం అజయ్ ఘోష్ తెలిపిన ఈ విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Exit mobile version