Site icon NTV Telugu

Ajay Ghosh : ఇండియాలో ఆ పార్టీలన్నీ ఏకం కావాలి : నటుడు అజయ్ ఘోష్‌

Ajay Ghosh

Ajay Ghosh

Ajay Ghosh : స్టార్ యాక్టర్ అజయ్ ఘోష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నారు. సాధారణంగా ఆయన సినిమాల గురించి తప్ప రాజకీయాల గురించి పెద్దగా మాట్లాడరు. అలాంటి ఆయన మొదటిసారి రాజకీయాల గురించి అందులోనూ కమ్యూనిష్టు పార్టీల గురించి మాట్లాడటం ఆశ్చర్యం రేకెత్తిస్తోంది. పుష్ప సినిమా తర్వాత ఆయన ఫుల్ బిజీ యాక్టర్ అయ్యారు. సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ గడిపేస్తున్నారు. అయితే తాజాగా ఆయన హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన భగత్ సింగ్ యువజన ఉత్సవాల ముగింపు వేడుకలకు హాజరయ్యారు.

Read Also : Rajamandri: మరో వ్యక్తితో చాటింగ్ చేస్తుందని తల్లి, కూతుళ్ల హత్య

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ప్రపంచంలో కమ్యూనిష్టు పార్టీల అవసరం చాలా ఉంది. ఇప్పటికే చాలా దేశాల్లో కమ్యూనిస్టు పార్టీలు అధికారంలోకి వస్తున్నాయి. కానీ మన దేశంలో మాత్రం రావట్లేదు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఈ దేశంలో కమ్యూనిష్టు పార్టీలు ఏకం కావాల్సిన అవసరం ఉంది. కమ్యూనిష్టు నేతలు ఒక మెట్టు దిగి ప్రజల కోసం ఏకం కవాలి. ఈ దేశాన్ని కమ్యూనిష్టు పార్టీలే కాపాడాలి’ అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అయితే ఇతర పార్టీల గురించి మాట్లాడకుండా ఆయన ఇలా కేవలం కమ్యూనిష్టు పార్టీల గురించే మాట్లాడటం ఆసక్తి రేకెత్తిస్తోంది.

Exit mobile version