దృశ్యం సినిమా ప్రయాణం మలయాళంలో మొదలై సౌత్ నుంచి నార్త్ వరకూ అన్ని ఇండస్ట్రీలకీ పాకింది. ఒక మర్డర్ చుట్టూ అల్లిన సస్పెన్స్ థ్రిల్లర్ ని జీతూ జోసఫ్ సూపర్బ్ గా రాసి డైరెక్ట్ చేస్తే, మెయిన్ లీడ్ ప్లే చేసిన ప్రతి హీరో అద్భుతంగా నటించి మెప్పించాడు. ఇండియాలోనే మోస్ట్ ఎంగేజింగ్ థ్రిల్లర్ గా పేరు తెచ్చుకున్న దృశ్యం సీరిస్ నుంచి ఇప్పటికే రెండు పార్ట్స్ బయటకి వచ్చాయి. అయితే మోహన్ లాల్ నటించిన మలయాళ దృశ్యం, దృశ్యం 2.. వెంకీ మామ నటించిన తెలుగు దృశ్యం, దృశ్యం 2 ఇప్పటివరకూ థియేటర్ రిలీజ్ అయిన ధాకలాలు లేవు. ఈ నాలుగు సినిమాలు ఎంత పేరు తెచ్చుకున్నా, ఎంతమంది ఆడియన్స్ ని మెప్పించినా అది ఒటీటీకే పరమితం అయ్యింది.
Read Also: Shankarabharanam: శంకరాభరణం చిత్రానికి మరో అరుదైన గౌరవం !!
సౌత్ దృశ్యం సీరీస్ లా కాకుండా నార్త్ లో అజయ్ దేవగన్(Ajay Devgn) మాత్రం తన సినిమాలని థియేటర్ లో రిలీజ్ చేస్తున్నాడు. ఫస్ట్ భాగాన్ని కూడా థియేటర్ లో విడుదల చేసిన అజయ్, ఇప్పుడు దృశ్యం 2 సినిమాని కూడా గ్రాండ్ గా థియేటర్ రిలీజ్ చేశాడు(#Drishyam2). ఈ క్రైమ్ థ్రిల్లర్ ఫ్రాంచైజ్ కి ఆల్రెడీ ఫాన్స్ ఉండడంతో, దృశ్యం 2 సినిమా హిందీలో మొదటిరోజు 15.38 కోట్లు రాబట్టింది. ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అవ్వడంతో, సెకండ్ డే ఫస్ట్ డే కన్నా ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి, మూడో రోజు రెండో రోజు కన్నా ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి. సండే వీకెండ్ కావడం, టాక్ చాలా బాగుండడంతో ఆడియన్స్ దృశ్యం 2 సినిమాని చూడడానికి క్యూ కట్టారు. దీంతో ఈ మూవీ థర్డ్ డే 27.17 కోట్లు రాబట్టి సెన్సేషనల్ గ్రోత్ ని చూసింది. ఓవరాల్ గా దృశ్యం 2 మూవీ ఇప్పటివరకూ 64.14 కోట్ల గ్రాస్ ని రాబట్టింది(Drishyam2 Collections). వీక్ డేస్ మొదలైనా కూడా దృశ్యం 2 కలెక్షన్స్ లో పెద్దగా డ్రాప్ కనిపించట్లేదు. దీంతో మొదటివారం ఎండ్ అయ్యే సమయానికి దృశ్యం 2 సినిమా వంద కోట్ల గ్రాస్ మార్క్ ని టచ్ చేసే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మన తెలుగు దృశ్యం, దృశ్యం 2 సినిమాలు కూడా థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ఉంటే అవి ఇక్కడ కూడా మంచి కలెక్షన్స్ ని రాబట్టేవి. ఎలాగూ పార్ట్ 3 ఉంటుంది కాబట్టి ఆ టైంకైనా మేకర్స్ దృశ్యం 3ని థియేటర్ లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తారేమో చూడాలి.
