Site icon NTV Telugu

Bholaa Trailer: ఇది ఖైదీ లాంటిదే కానీ ఖైదీ కాదు…

Bholaa Trailer

Bholaa Trailer

దృశ్యం 2 సినిమాని హిందీ రీమేక్ చేసి 250 కోట్లు కలెక్ట్ చేసిన బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, మరోసారి బాక్సాఫీస్ ని టార్గెట్ చేస్తూ మార్చ్ 30న ‘భోలా’ సినిమాతో ఆడియన్స్ ముందుకి రానున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో సూపర్ హిట్ అయిన కార్తీ ‘ఖైదీ’ సినిమాకి ‘భోలా’ రీమేక్ వర్షన్. లోకేష్ కనగరాజ్ ని స్టార్ డైరెక్టర్ చేసిన ఖైదీ సినిమా, ఒక రాత్రిలో జరిగే కథతో రూపొందింది. ఈ మూవీలోని యాక్షన్ ఎపిసోడ్స్ కి అన్ని వర్గాల ఆడియన్స్ నుంచి మంచి అప్లాజ్ వచ్చింది. దీంతో అజయ్ దేవగన్ ఖైదీ సినిమా రైట్స్ కొనుక్కోని, తన సొంత దర్శకత్వంలోనే ‘భోలా’గా ఖైదీని తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ నుంచి ఇప్పటివరకూ రిలీజ్ అయిన ఏ ప్రమోషనల్ కంటెంట్ కూడా ‘ఖైదీ’ సినిమాని గుర్తు చెయ్యలేదు. లేటెస్ట్ గా రిలీజ్ అయిన భోలా ట్రైలర్ కూడా సౌత్ ఆడియన్స్ ని ఆశ్చర్యపోయేలా చేస్తుంది. అప్పుడే జైలు నుంచి బయటకి వచ్చిన ఖైదీ, ఒక్కసారి కూడా చూడని కూతురి కోసం వెళ్లే సమయంలో అనివార్య కారణాల వలన పోలీసులకి హెల్ప్ చెయ్యాల్సి వస్తుంది. ఇదే సింపుల్ గా ఖైదీ కథ, ఈ లైన్ ని అలానే తీసుకున్న అజయ్ దేవగన్ కథనం విషయంలో పూర్తిగా మార్పులు చేసినట్లు ఉన్నాడు.

పోలిస్ పాత్ర కోసం ‘టబు’ని తెచ్చిన దగ్గర నుంచే మార్పులు చెయ్యడం మొదలుపెట్టిన అజయ్ దేవగన్, హీరోయిన్ క్యారెక్టర్ ని కూడా పెట్టాడు. ఈ పాత్ర కోసం అమలా పాల్ ని తీసుకొచ్చిన అజయ్ దేవగన్, ఖైదీని కంప్లీట్ కమర్షియల్ సినిమాగా మార్చాడు. లైట్ గా డివోషనల్ టచ్ కూడా ఇచ్చిన అజయ్ దేవగన్, ఖైది ఫైట్స్ ని మించే రెంజులో భోలా యాక్షన్ ఎపిసోడ్స్ ని డిజైన్ చేయించుకున్నట్లు ఉన్నాడు. ట్రైలర్ లో చూపించిన యాక్షన్ ఎపిసోడ్స్ సూపర్బ్ గా ఉన్నాయి. అజయ్ దేవగన్ లుక్ టెర్రిఫిక్ గా ఉంది, ముఖ్యంగా రవి బసూర్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ భోలా ట్రైలర్ ని మరింత ఎలివేట్ చేసింది. నార్త్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే విధంగా అజయ్ దేవగన్ మార్పులు చేసాడు అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది కానీ ఒక కమర్షియల్ సినిమాని ౩Dలో ఎందుకు డైరెక్ట్ చేస్తున్నాడు అనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు. మరి మార్చ్ 30న అజయ్ దేవగన్ నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా భోలా సినిమాతో హిట్ కొడతాడా లేక అనవసరంగా మార్పులు చేసాడని విమర్శలపాలవుతాడా అనేది చూడాలి.

Exit mobile version