Site icon NTV Telugu

అమితాబ్ తో మూవీ… చిరకాల స్వప్నం సాకారమైందంటోన్న అజయ్!

అమితాబ్ బచ్చన్, అజయ్ దేవగణ్ నటులుగా ఇంతకు ముందు కూడా కలసి పని చేశారు. కానీ, ఇప్పుడు అజయ్ డైరెక్టర్ గా బిగ్ బీతో సినిమా చేస్తున్నాడు. అదే ‘మేడే’. సౌత్ బ్యూటీ రకుల్ ప్రీత్ కూడా ఇందులో ఉండటం విశేషం!
“అమితాబ్ ని డైరెక్ట్ చేయటం, ఏ దర్శకుడికైనా గొప్ప కల. అదృష్టవశాత్తూ నేను ఆ స్వప్నం సాకారం చేసుకోగలిగాను!” అన్నాడు అజయ్ దేవగణ్. అంతే కాదు బచ్చన్ సాబ్ సెట్ మీద ఉంటే పనులన్నీ చకచకా సాగిపోతాయని దేవగణ్ చెప్పాడు. బాలీవుడ్ కి ఆయన మెగా స్టార్ అయినా కూడా ఇప్పటికీ సరిగ్గా టైంకి సెట్స్ మీదకి వచ్చేస్తాడట. డైరెక్టర్ చెప్పింది చెప్పినట్టుగా చేస్తాడట. అందుకే, ఆయనతో ఉంటే వర్క్ ఎంతో హ్యాపీగా సాగిపోతుందని డైరెక్టర్ అజయ్ అంటున్నాడు.

అమితాబ్ బచ్చన్, రకుల్ ప్రీత్ సింగ్ లాంటి యాక్టర్స్ తో రూపొందుతోన్న ‘మేడే’లో అజయ్ దేవగణ్ పైలట్ గా నటిస్తున్నాడు. దోహా నుంచీ కొచ్చి వెళుతోన్న ఓ ఫ్లైట్ లో ఏం జరిగిందనేదే సినిమా స్టోరీనట! ఇంకా పూర్తి వివరాలు ఇప్పుడే తెలియనప్పటికీ అజయ్ దేవగణ్ డైరెక్ట్ చేస్తుండటంతో ప్రాజెక్ట్ పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఆయన గతంలోనూ కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించాడు. చూడాలి మరి, ఈ సారి బిగ్ బీతో దేవగణ్ చేసిన బిగ్ అటెంప్ట్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ అందిస్తుందో…

Exit mobile version