Singham 3: అజయ్ దేవ్‌గన్‌తో మరోసారి రోహిత్ శెట్టి!

Singham 3

Singham 3

Ajay Devgan Rohit Shetty Joining Hands For Singham 3: అజయ్‌ దేవ్‌గన్, రోహిత్ శెట్టి కాంబినేషన్‌లో ‘సింగం రిటర్న్స్’ మూవీ వచ్చి ఎనిమిదేళ్ళు అయ్యింది. ఈ మధ్యలో రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన ‘సింబ’, ‘సూర్యవంశీ’ చిత్రాలలో అజయ్‌ దేవ్‌గన్ అతిథి పాత్రల్లో మెరిశాడు. అయితే ఇప్పుడు వీరిద్దరి కాంబోలో ‘సింగం -3’కి రంగం సిద్ధం కాబోతోంది. వచ్చే యేడాది ఏప్రిల్‌లో రోహిత్ శెట్టి కోసం మరోసారి అజయ్ దేవ్‌గన్ పోలీస్ ఆఫీసర్ వేషం వేయబోతున్నాడట. అప్పటికి అజయ్ దేవ్‌గన్ తన కమిట్‌మెంట్స్‌ను పూర్తి చేసుకుని ఫ్రీ అవుతాడని అంటున్నారు. అలానే రోహిత్ శెట్టి కూడా రణవీర్ సింగ్, పూజా హెగ్డే, జాక్విలిన్ ఫెర్నాండేజ్‌తో ‘సర్కస్’ మూవీ తీస్తున్నాడు.

మరో పక్క షేక్స్పియర్ ‘కామెడీ ఆఫ్‌ ఎర్రర్స్’ ఆధారంగా ‘అంగూర్’ చేస్తున్నాడు. ఈ రెండు ప్రాజెక్ట్స్ పూర్తి చేసి, ఏప్రిల్ నుండి ‘సింగం -3’పై రోహిత్ దృష్టి పెడతాడని అంటున్నారు. గత యేడాది ‘సూర్యవంశీ’ పతాక సన్నివేశానికి కంటిన్యుటీగా, పాక్ ఉగ్రవాది ఒమర్ హఫీజ్ (జాకీ ష్రాఫ్‌)ను పట్టుకోవడానికి పాక్ ఆక్రమిత కశ్మీర్ లోకి బాజీరావ్ సింగం వెళ్ళడమే ఈ తాజా చిత్ర కథాంశమని తెలుస్తోంది. ఆ సినిమా క్లయిమాక్స్ లో అతనికి సహాయంగా సంగ్రామ్ భలేరావ్ (రణవీర్‌ సింగ్), వీర్ సూర్యవంశీ (అక్షయ్‌ కుమార్) జత కలిసినా ఆశ్చర్యపోనక్కర్లేదు!