Singham 3: అజయ్ దేవ్‌గన్‌తో మరోసారి రోహిత్ శెట్టి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ajay Devgan Rohit Shetty Joining Hands For Singham 3: అజయ్ దేవ్‌గన్, రోహిత్ శెట్టి కాంబినేషన్‌లో ‘సింగం రిటర్న్స్’ మూవీ వచ్చి ఎనిమిదేళ్ళు అయ్యింది. ఈ మధ్యలో రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన ‘సింబ’, ‘సూర్యవంశీ’ చిత్రాలలో అజయ్ దేవ్‌గన్ అతిథి పాత్రల్లో మెరిశాడు. అయితే ఇప్పుడు వీరిద్దరి కాంబోలో ‘సింగం -3’కి రంగం సిద్ధం కాబోతోంది. వచ్చే యేడాది ఏప్రిల్‌లో రోహిత్ శెట్టి కోసం మరోసారి అజయ్ దేవ్‌గన్ పోలీస్ ఆఫీసర్ వేషం వేయబోతున్నాడట. అప్పటికి అజయ్ దేవ్‌గన్ తన కమిట్‌మెంట్స్‌ను పూర్తి చేసుకుని ఫ్రీ అవుతాడని అంటున్నారు. అలానే రోహిత్ శెట్టి కూడా రణవీర్ సింగ్, పూజా హెగ్డే, జాక్విలిన్ ఫెర్నాండేజ్‌తో ‘సర్కస్’ మూవీ తీస్తున్నాడు.
మరో పక్క షేక్స్పియర్ ‘కామెడీ ఆఫ్ ఎర్రర్స్’ ఆధారంగా ‘అంగూర్’ చేస్తున్నాడు. ఈ రెండు ప్రాజెక్ట్స్ పూర్తి చేసి, ఏప్రిల్ నుండి ‘సింగం -3’పై రోహిత్ దృష్టి పెడతాడని అంటున్నారు. గత యేడాది ‘సూర్యవంశీ’ పతాక సన్నివేశానికి కంటిన్యుటీగా, పాక్ ఉగ్రవాది ఒమర్ హఫీజ్ (జాకీ ష్రాఫ్)ను పట్టుకోవడానికి పాక్ ఆక్రమిత కశ్మీర్ లోకి బాజీరావ్ సింగం వెళ్ళడమే ఈ తాజా చిత్ర కథాంశమని తెలుస్తోంది. ఆ సినిమా క్లయిమాక్స్ లో అతనికి సహాయంగా సంగ్రామ్ భలేరావ్ (రణవీర్ సింగ్), వీర్ సూర్యవంశీ (అక్షయ్ కుమార్) జత కలిసినా ఆశ్చర్యపోనక్కర్లేదు!
Also Read
తాజావార్తలు
-
Modi-Jinping: అరుదైన ఖనిజాలు, వాణిజ్య లోటు.. మోడీ-జిన్‌పింగ్ భేటీలో కీలకాంశాలు..
-
Soori : అద్దం ముందు షర్ట్ విప్పేసి.. నా ఒంటిపై ఉన్న గాయాలకు నేనే ముద్దులు పెట్టుకున్నా.
-
Ganesh Utsav: ఇంటికే పరిమితమైన గణపతి గల్లీలోకి ఎలా వచ్చాడో తెలుసా? 1905 నాటి ఆ చరిత్ర ఇదిగో!
-
Notification Cancelled: నిరుద్యోగులకు అలర్ట్.. TGPSC నుంచి విడుదలైన ఆ నోటిఫికేషన్ రద్దు..
-
Irumudi Effect : అయ్యప్ప దీక్షలో గణపయ్య.. తలపై స్వయంగా ‘ఇరుముడి’ పెడుతున్న శివుడు!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!