Site icon NTV Telugu

Ajay Devgan: షారుఖ్ ఖాన్ తో గొడవ.. నోరువిప్పిన కాజోల్ భర్త

Ajay Devgan

Ajay Devgan

చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోల మధ్య పోటీ ఉండడం సహజమే.. అది ఆరోగ్యకరమైన పోటీనే కానీ హాని చేసేది కాదు. అయితే ఇది కాకుండా మరికొన్ని విభేదాలు స్టార్ హీరోల మధ్య ఉన్న విషయం అందరికి తెలిసిందే. అలాంటి విభేదాలు ఉన్న హీరోలు బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్, స్టార్ హీరోయిన్ కాజోల్ భర్త, హీరో అజయ్ దేవగన్. వీరిద్దరి మధ్య పర్సనల్ విబేషలు ఉన్నాయని, ఈ స్టార్ హీరోల మధ్య పచ్చగడ్డి వేస్తే  భగ్గుమంటుందని బాలీవుడ్ లో గుసగుసలు వినిపించిన విషయం విదితమే. ఈ గొడవలకు కారణం అజయ్ భార్య కాజోల్ అని కూడా వార్తలు వినిపించాయి. అయితే ఈ గొడవలపై ఈ ఇద్దరు హీరోలు ఇప్పటివరకు నోరు విప్పకపోవడం విశేషం. అయితే తాజాగా అజయ్ ఈ గొడవపై స్పందించాడు.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అజయ్ కు షారుఖ్ తో ఉన్న విభేదాలు ఏంటి అనేదానిపై క్లారిటీ ఇచ్చాడు. “నాకు , షారుఖ్ మధ్య ఎలాంటి విభేదాలు లేవు.. నేను, షారుఖ్, సల్మాన్‌,  అమీర్ అందరం ఒకేసారి ఇండస్ట్రీకి వచ్చాం.. మా మధ్య ఎప్పుడు సినిమాల గురించి పోటీ ఉంటుంది తప్ప మరింకేమి లేదు. ముఖ్యంగా షారుఖ్ కు నాకు మధ్య గొడవలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. వాటిలో నిజం లేదు.. అవన్నీ అబద్దాలు” అని కొట్టిపారేశాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.  మా ఇద్దరి మధ్య గొడవలు ఉన్నాయి అని ఏ హీరో చెప్తాడు.. చాలా విన్నాం ఇలాంటివి అని కొందరు.. నిజమే నమ్మేశాం అని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు

Exit mobile version