Site icon NTV Telugu

Mangalavaaram: మంగళవారం.. టీవీ లోనూ దుమ్మురేపింది

Mangalavaram Allu Arjun

Mangalavaram Allu Arjun

Mangalavaaram: ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలెంటెడ్ డైరెక్టర్ అనిపించుకున్న అజయ్ భూపతి దర్శకత్వంలో అదే సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిన పాయల్ రాజ్ పుత్ నటించిన చిత్రం మంగళవారం. ఎన్నో అంచనాల మధ్య గతేడాది నవంబర్ 17 న రిలీజ్ అయిన ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ ను అందుకొని భారీ విజయాన్ని అందుకుంది. సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ గా రిలీజ్ అయ్యి భారీ కలక్షన్స్ రాబట్టింది. ఇక ఈ చిత్రంలో నందిత శ్వేత, దివ్య పిల్లై, అజ్మల్ అమీర్, రవీంద్ర విజయ్, కృష్ణ చైతన్య, అజయ్ ఘోష్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో రివేంజ్ థ్రిల్లర్‌గా అజయ్ భూపతి ఈ సినిమా కథను రాసుకున్నారు. ఈ మూవీలో ఓ సెక్సువల్ డిజార్డర్ పాయింట్‌ను టచ్ చేశారు. ఇక పాయల్ నటనకు మార్కులు గట్టిగానే పడ్డాయి.

ఇక థియేటర్ లోనే కాదు ఓటిటీలో కూడా రచ్చ చేసింది. అక్కడ కూడా మంచి పోటీనిచ్చి రికార్డు సృష్టించింది. ఇక్కడితో ఆగకుండా ఇప్పుడు టెలివిజన్ ప్రీమియర్ లో కూడా మంగళవారం తన సత్తా చాటింది. ఇటీవల స్టార్‌మాలో ఈ మూవీ ఫస్ట్ టైమ్ టెలికాస్ట్ అయ్యింది. ఈ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌కు అదిరిపోయే టీఆర్‌పీ రేటింగ్ వచ్చింది.మంగళవారం మూవీకి అర్బన్, రూరల్ కలిపి 8.3 టీఆర్‌పీ రేటింగ్ వచ్చింది. స్టార్ హీరో లేని సినిమాకి రేటింగ్ రావడం రికార్డు అనే చెప్పాలి. సినిమా కథ మరియు పాత్రలు, అంజనీష్ లోక్‌నాథ్‌ సంగీతం, అజయ్ భూపతి టేకింగ్ ఈ విజయానికి కారణమని చెప్పాలి. ఇక ఈ విజయంపై చిత్ర బృందం ఆనందంగా ఉన్నట్లు తెలిపారు.

Exit mobile version