NTV Telugu Site icon

Aishwarya Rajinikanth: విడాకుల తర్వాత తొలిసారి ధనుష్ పేరు ప్రస్తావిస్తూ ఐశ్వర్య కీలక వ్యాఖ్యలు

Aishwarya Dhanush

Aishwarya Dhanush

Aishwarya Rajinikanth Talks About Actor Dhanush for the first Time After Divorce: తమిళ స్టార్ హీరో ధనుష్ – దర్శకుడు రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య 2004లో వివాహం చేసుకున్నారు. పెళ్లయిన 18 ఏళ్ల తర్వాత ఈ జంట విడాకులు తీసుకున్నారు. విడాకుల తర్వాత, ఐశ్వర్య – ధనుష్ ఇద్దరూ తాను విడిపోవడం గురించి పెదవి విప్పలేదు. అయితే ఐశ్వర్య రజనీకాంత్ తొలిసారిగా తన మాజీ భర్త గురించి మాట్లాడింది. అసలు విషయం ఏమిటంటే ఆమె డైరెక్ట్ చేసిన లాల్‌ సలామ్‌ సినిమా పెద్ద హిట్‌ అవుతుందని అభిమానుల్లో అంచనాలు నెలకొని ఉండగా, ఆ సినిమా ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఇదిలా ఉంటే ఐశ్వర్య సినిమాకు సంబంధించిన ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. ఆ ఇంటర్వ్యూలో, ఇంటర్వ్యూయర్ ఆమెతో, “మీరు పరిచయం చేసిన అనిరుధ్ ఇప్పుడు భారతదేశంలో పెద్ద స్థానంలో ఉన్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు” అని అదిగితే అందుకు కారణం నేను కాదు ధనుష్ అని ఐశ్వర్య సమాధానమిచ్చింది. ఇంకా మాట్లాడుతూ.. అనిరుధ్‌ను విదేశాలకు పంపించి చదివించాలని అతని తల్లిదండ్రులు భావించారు, అయితే ధనుష్ వారి మనసు మార్చి అనిరుధ్‌కి కీబోర్డు కొనిచ్చాడని అన్నారు.

Ajith Kumar: ఆసుపత్రి పాలైన హీరో అజిత్ లేటెస్ట్ ఫోటో చూశారా?

ఇక అనిరుధ్ 3 సినిమాకి కంపోజ్ చేయాలి అని ధనుషే భావించాడని, అనిరుధ్ ఎదుగుదల చూస్తుంటే ఆనందంగా ఉందని అన్నారు. నిజానికి ధనుష్-ఐశ్వర్య విడిపోయినట్లు ప్రకటించినప్పటి నుండి, ఇద్దరూ తమ గురించి బయట ఎక్కడా మాట్లాడలేద్దు. ధనుష్ ఇప్పుడు కూడా తన మాజీ భార్య గురించి ఏ ఇంటర్వ్యూలో మాట్లాడడు. అయితే అందుకు భిన్నంగా కెమెరా ముందు ధనుష్ పేరు ఐశ్వర్య మాట్లాడడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. నటుడు ధనుష్ నటించిన తొలి చిత్రం ‘కాదల్ కొండేన్’. ఈ సినిమా 2003లో విడుదలైంది. ఈ సినిమా ప్రీమియర్ షో సందర్భంగా పరిచయమైన ఐశ్వర్య, ధనుష్‌లు స్నేహితులయ్యారని, ఆ తర్వాత వారి మధ్య ప్రేమ చిగురించిందని చెబుతున్నారు. వారు 1 సంవత్సరం పాటు ప్రేమలో ఉండి ఇరు కుటుంబాల అంగీకారంతో 18 నవంబర్ 2004న వివాహం చేసుకున్నారు. ధనుష్-ఐశ్వర్యలకు యాత్ర – లింగ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిద్దరినీ ధనుష్ – ఐశ్వర్య కో-పేరెంటింగ్ మోడ్‌లో పెంచుతున్నారు.