NTV Telugu Site icon

Aishwarya Rajesh: ఆ బాధ చాలా భయంకరంగా ఉంటుంది: ఐశ్వర్యా రాజేష్

February 7 (87)

February 7 (87)

హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ గురించి పరిచయం అక్కర్లేదు.. తెలుగు హీరోయిన్ అయినప్పటికీ తమిళ ఇండస్ట్రీలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో స్టార్ డమ్ సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది హీరోయిన్ ఐశ్వర్య రాజేష్. దీంతో టాలీవుడ్ లో ఈ అమ్మడుకి ఆఫర్‌లు క్యూ కడుతున్నాయి. ఇదిలా ఉంటే సెలబ్రేటీలకి బ్రెకప్‌లు కామన్ విషయం. ఎంత త్వరగా ప్రేమలో పడతారో అంతే త్వరగా విడిపోతారు. ఇలాంటి జంటలను మనం చాలా మందిని చూశాం. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఐశ్వర్య కూడా తన బ్రేకప్ విషయాలు పంచుకుంది.

ఐశ్వర్య మాట్లాడుతూ.. ‘ప్రేమ కంటే అది బ్రేక్ అయినప్పుడు వచ్చే బాధ అంటే నాకు ఎంతో భయం. నేను చాలా ఎమోషనల్ అమ్మాయిని. ప్రేమించే సమయం కంటే ప్రేమ నుంచి బయటకు వచ్చేందుకు నేను ఎక్కువ సమయం తీసుకుంటాను. గతంలో నేను ఒక రిలేషన్‌షిప్‌లో ఉన్నాను. సినిమాల్లోకి అడుగు పెట్టిన కొత్తలో ఒక వ్యక్తిని చాలా ఇష్టపడ్డాను. అలాగే అతని నుంచి వేధింపులు కూడా ఎదుర్కొన్నా. అంతకంటే ముందు కూడా ఒకసారి అలాంటి ప్రేమను చూశా. అసలు రిలేషన్‌షిప్‌లో ఇలా ఎందుకు జరుగుతుంది అని భయపడ్డా. అందుకే ఇప్పుడు రిలేషన్‌షిప్‌ని అక్సెప్ట్ చేయడానికి ఎంతో ఆలోచిస్తున్నాను’ అంటూ తెలిపింది. అంతే కాదు ఈ ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ సక్సెస్ గురించి కూడా మాట్లాడుతూ ‘ఈ సినిమాలో గోదావరి యాసలో మాట్లాడే భాగ్యం కోసం అనిల్ రావిపూడి నా పేరు చెప్పినప్పుడు. తనైతే చాలా ఈజీగా చేస్తుంది అంటూ వెంకటేష్ చాలా సపోర్ట్ చేశారు. ఇంత కామెడీ ఉన్న రోల్ చేయడం నా సినీ కెరియర్‌లో ఇదే మొదటిసారి. మహేష్ బాబు మమ్మల్ని ఇంటికి ఆహ్వానించారు ‘ఏవయ్యా అనిల్ ఈ పిల్లని ఎక్కడ పుట్టావు’ అని అన్నారు. నేను జీవితంలో ఇంతవరకు రావడానికి మా అమ్మే కారణం’ అంటూ చెప్పుకొచ్చింది ఐశ్వర్య.