NTV Telugu Site icon

Aishwarya Rajesh: ఆ హీరోతో ఎప్పటికైనా సినిమా చేయాలనేది నా కోరిక : ఐశ్వర్య రాజేష్

Untitled Design (23)

Untitled Design (23)

సంక్రాంతి కానుకగా విడుదలైన.. ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ బాక్సాఫీస్ వద్ద వండర్స్ క్రియేట్ చేస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. విక్టరీ వెంకటేష్ హీరోగా, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి హీరోయిన్ గా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ, తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. దీంతో ఈ సినిమా నటినటులకు ప్రేక్షకులో విపరీతమైన ఫ్యాన్ బేస్ పెరిగిపోయింది. ముఖ్యంగా ఐశ్వర్య రాజేష్ కెరీర్ కి ఈ సినిమా బాగా కలిసొచ్చింది. చెన్నైలో పుట్టి, పెరిగి అక్కడే హీరోయిన్‌గా వరుసగా తమిళ సినిమాలు చేసినప్పటికీ ఈ అమ్మాయి నిజానికి అచ్చ తెలుగు అమ్మాయే. తెలుగులో కూడా అరకోర సినిమాలు తీసినప్పటికీ అంతగా హిట్ మాత్రం అందుకోలేకపోయింది. ఇక ఇప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ హిట్ తో వరుస అవకాశాలు రావడం ఖాయం.

Also Read: Janhvi Kapoor: పెళ్లి చేసుకుని.. ముగ్గురు పిల్లలతో సెటిల్ అవ్వాలని ఉంది : జాన్వీ కపూర్

గంగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఐశ్వర్య స్టార్ హీరో తారక్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. మీ డ్రీమ్ రోల్ ఏంటీ? ఏ హీరోతో నటించాలని కోరుకుంటున్నారు? అని అడగడంతో ‘నాకు NTR అంటే చాలా ఇష్టం.ఆయనతో నటించే ఛాన్స్ వస్తే అసలు వదులుకోను. ఆయనని స్టూడెంట్ నెం.1 మూవీ నుంచి చూస్తున్నాం. తారక్ డ్యాన్స్.. డైలాగ్ డెలివరీ, ఆయన ఎమోషనల్ నాకు ఇష్టం’ అని తెలిపింది. ప్రజంట్ ఈ అమ్మడు మాట సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీలో మీనాక్షి చౌదరి కూడా నటించిన విషయం తెలిసిందే . ప్రజంట్ యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది ఈ చిన్నది. అయితే మీనాక్షి కూడా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకు ప్రభాస్ తో నటించాలని ఉంది అని తెలిపింది. మొత్తానికి ఈ ఇద్దరు హీరోయిన్లు కెరీర్ ను ముందుగా బాగా ప్లాన్ చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.