NTV Telugu Site icon

Balakrishna: బాలయ్య కాళ్ళు మొక్కిన ఐష్

Balakrisgba

Balakrisgba

Aishwarya Rai Takes Blessings from Balakrishna: అబుదాబి వేదికగా ఐఫా అవార్డుల కార్యక్రమం ఘనంగా జరుగుతున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ వేడుకల్లో తెలుగు సినీ పరిశ్రమనుంచే కాదు బాలీవుడ్, కోలీవుడ్, శాండిల్ వుడ్, మాలీవుడ్ మంచి సినీ తారలతో పాటు స్టార్ టెక్నీషియన్స్ కూడా జాయిన్ అయ్యారు. ఇక ఈ కార్యక్రమంలో ఒక ఆసక్తికరమైన ఘట్టం చోటు చేసుకుంది అదేమంటే పొన్నియన్ సెల్వన్ సినిమాకి గాను ఐశ్వర్యరాయ్ తమిళంలో బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు కైవసం చేసుకుంది. ఈ అవార్డుని నందమూరి బాలకృష్ణ చేతుల మీదగా అందజేశారు.

Ramajogaiah Sastry: జూనియర్ ఎన్టీఆర్ అభిమానికి దండం పెట్టిన రామజోగయ్య శాస్త్రి

ఈ క్రమంలో అవార్డు అందుకునేందుకు స్టేజి మీదకు వచ్చిన ఐశ్వర్యారాయ్ అవార్డు అందుకునే ముందు నందమూరి బాలకృష్ణ కాళ్ళకు నమస్కారం చేయడం హాట్ టాపిక్ అవుతోంది. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. IIFA 2024 అవార్డులు అబుదాబిలో జరుగుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవికి ఔట్ స్టాండింగ్ అచీవ్మెంట్ ఇండియన్ సినిమా అవార్డు అందుకున్నారు. ఆయనను బాలకృష్ణ, వెంకటేష్ అభినందించారు.

Show comments