Site icon NTV Telugu

Bigg Boss Telugu 7: లాస్ట్ మినిట్లో హ్యాండ్ ఇచ్చిన నటి.. ఏకంగా హీరోయిన్ ను దింపుతున్న బిగ్ బాస్ టీమ్

Aishwarya Pisse Into Bigg Boss 7

Aishwarya Pisse Into Bigg Boss 7

Aishwarya Pisse to enter Bigg Boss Telugu 7 House: బిగ్ బాస్ తెలుగు 7 ఇంకా రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. నాగ్ హోస్ట్ చేయబోతున్న ఈ షోలో పాల్గొనబోయే కంటెస్టెంట్ ల గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే ఇద్దరు కన్ఫర్మ్ అయిన కంటెస్టెంట్లు చివరి నిమిషంలో డ్రాప్ కావడంతో వారికి రీప్లేస్ మెంట్స్ వెతుకుతున్నారు. ఇక అందులో భాగంగా ఒక సీరియల్ హీరోయిన్ ను ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తోంది. ఆమె మరెవరో కాదు కన్నడ భామ ఐశ్వర్య పిస్సే. అగ్నిసాక్షి సీరియల్ తో గౌరిగా తెలుగు బుల్లితెరపై అడుగుపెట్టిన ఐశ్వర్య ముందు తెలుగు రాకపోవడంతో ఆరంభంలో ఇంగ్లీష్ లో డైలాగ్స్ రాసుకుని చెప్పేదట. అయితే ఇప్పుడు బాగా అలవాటు కాకపోవడంతో తెలుగులో చక్కగా మాట్లాడేస్తోంది.

Bigg Boss Telugu 7 : బిగ్ బాస్‌లోకి మొన్నే హిట్టు కొట్టిన కుర్ర హీరోయిన్.. హాట్ నెస్ కోసమే బడా ప్లాన్?

ఇక ఇప్పుడు ఆమె కస్తూరి సీరియల్ లో లీడ్ క్యారెక్టర్ లో నటిస్తోంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే బుల్లితెర నటి న‌వ్యస్వామి అన్నయ్యను ఐశ్వర్య వివాహం చేసుకుంది. కన్నడలో ముందుగా రెండు సీరియ‌ల్స్‌లో చిన్న పాత్రలు చేసిన ఐశ్వర్య ఆ తర్వాత మెయిన్ లీడ్ గా కూడా ఒక సీరియల్ లో చేసింది. ఓ వైపు నటన కొనసాగిస్తూనే డిగ్రీ పూర్తి చేసిన ఆమె రెండు కన్నడ సినిమాల్లో కూడా చిన్న పాత్ర‌లు చేసింది. కానీ సీరియ‌ల్స్ లో వరుస అవకాశాలు రావడంతో సినిమా ఛాన్సులు పక్కన పెట్టేసి పూర్తిగా సీరియల్స్ మీదనే ఫోకస్ చేస్తోంది. ఇక ఆమె బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడం హాట్ టాపిక్ అవుతోంది. ఆమె హౌస్ లో ఎలా ఉండనుంది? ఎన్ని రోజులు నెట్టుకు రాబోతుంది అనే విషయాల మీద చర్చ జరుగుతోంది.

Exit mobile version