Aishwarya Lekshmi: ఇండస్ట్రీలో అరుదైన స్టేట్మెంట్ ఇచ్చిన హీరోయిన్! ఆ ఆలోచన లేదట..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aishwarya Lekshmi: సినిమా ఇండస్ట్రీలో ఒక హీరోయిన్‌కు బ్యాక్-టు-బ్యాక్ హిట్లు వస్తే చాలు.. వెంటనే రెమ్యునరేషన్‌ను కోట్లలోకి పెంచేస్తుంటారు. కానీ అందుకు భిన్నంగా ఆలోచిస్తూ టాలీవుడ్, కోలీవుడ్‌లలో ఒక అరుదైన స్టేట్మెంట్ ఇచ్చింది స్టార్ బ్యూటీ ఐశ్వర్య లక్ష్మి. వరుస విజయాలతో క్రేజ్ పెరుగుతున్నప్పటికీ, ప్రస్తుతానికి తన పారితోషికాన్ని పెంచే ఆలోచన లేదని స్పష్టం చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. తన రెమ్యునరేషన్ హైక్‌పై ఐశ్వర్య లక్ష్మి తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “కేవలం హిట్లు వచ్చాయని రెమ్యునరేషన్ పెంచేయడం సరికాదు. నా పేరు చూసి థియేటర్లకు ప్రేక్షకులను రప్పించే స్థాయి, అంతటి మార్కెట్ వాల్యూ నాకు వచ్చిన రోజే నా రెమ్యునరేషన్ పెంచుతాను” అంటూ స్పష్టం చేశారు.
సరికొత్త మైండ్‌సెట్‌తో ఆమె చెప్పిన ఈ మాటలు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. హిట్లు, క్రేజ్ వస్తున్నా ఏమాత్రం గర్వం లేకుండా ఇంత గ్రౌండెడ్‌గా ఉండటం నిజంగా అభినందనీయమని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం ఐశ్వర్య లక్ష్మి చేతిలో పలు భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. గతంలో రిలీజ్ అయ్యి మంచి విజయం సాధించిన ‘మట్టి కుస్తీ’ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ‘మట్టి కుస్తీ 2’ రిలీజ్‌కు రెడీ అవుతుంది. దీనితో పాటు, మెగా హీరో సాయి దుర్గ తేజ్ సరసన ఆమె నటిస్తున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం ‘సంబరాల ఏటి గట్టు’పై కూడా ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రాలు కూడా హిట్ అయితే ఇండస్ట్రీలో ఐశ్వర్య లక్ష్మి రేంజ్ మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.
Also Read
- Ramayana: గణేష్ చతుర్థి రోజున ‘రామాయణం’ నుంచి దివ్యమైన సర్ప్రైజ్!
- Kollywood Sequel Flops : కోలీవుడ్ స్టార్స్‌కు కలిసిరాని సీక్వెల్స్.. జైలర్ 2 పరిస్థితి ఏంటో?
- Toxic OTT: బాక్సాఫీస్‌లో షాక్.. ఇప్పుడు ఓటీటీలోకి యశ్ ‘టాక్సిక్’, స్ట్రీమింగ్ డేట్ ఇదేనా?
- Jailer2 Telugu Rights : జైలర్ 2 తెలుగు రైట్స్ కోసం దిల్ రాజు vs నాగవంశీ
తాజావార్తలు
-
Gurugram Road Rage: మహిళా బైకర్‌ను వెంబడించి ఢీకొట్టిన కారు? కెమెరాలో షాకింగ్ దృశ్యాలు
-
Abhishek Sharma Records: రికార్డుల మోతమోగించిన అభిషేక్ శర్మ..!
-
Hyderabad: దారుణం.. హైదరాబాద్‌లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
-
Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
-
Harmanpreet Kaur: మీరే మాకు అతిపెద్ద బలం, మీ కోసం ఏదైనా చేస్తాం.. హర్మన్‌ప్రీత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?