Site icon NTV Telugu

Tollywood : లక్కునే నమ్ముకుంటున్న హీరోయిన్లు

Mirna Menon

Mirna Menon

Actresses Waiting for success: మాలీవుడ్ మీదుగా చెన్నైలో ఓ ఛాన్స్ పట్టుకుని ఆ తర్వాత తెలుగులోకి వచ్చి సెటిల్ కావాలనుకుంటున్న హీరోయిన్లు అందరిదీ లక్ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. కొందరు భామలకు గ్లామర్ అనుకున్నంతగా లేకపోయినా మేకర్స్ తో ఉన్న ర్యాపోతో ఏదో నెట్టుకొచ్చేస్తుంటారు. ఇంకొందరు సెకండ్ హీరోయిన్ ,క్యారెక్టర్ ఆర్టిస్ట్ లతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. తమిళ్ లో మెయిన్ హీరోయిన్ గా సెటిల్ కావాలని తెగ ట్రై చేస్తున్న ఐశ్వర్యలక్ష్మి పిఎస్ సిరీస్ తో కొంతవరకు మెరిసినప్పటికీ…ఆ మెరుపులు మెయిన్ హీరోల వరకు వెళ్లలేకపోయాయి. ఇలాక్కాదని మోడ్రన్ డ్రెస్ లతో సోషల్ మీడియాలో రచ్చచేసిననప్పటికీ..అది కూడా అంతంత మాత్రంగానే కిక్ ఇస్తుంది. ఇక తాజాగా ఐశ్వర్య లక్ష్మీ మరోసారి నెట్టింట్లో నేనున్నానని చెప్పుకునే ప్రయత్నం చేస్తూ వస్తుంది.

అలాగే జైలర్ లో రజనీ కోడలుగా ఇప్పుడిప్పుడే గుర్తింపుకు నోచుకుంటున్న మిర్నా మీనన్… తెలుగులో ఉగ్రంతో ఏదో ట్రై చేసింది గాని… అది ఓ పట్టాన వర్కవుట్ కాలేదు. కానీ అదేంటో జైలర్ ఇమేజ్ చూసి తమిళ తంబీలు అమ్మడికి ఆఫర్స్ ఇస్తున్నారు. వీటితో ట్రాక్ లోకి వస్తే మెయిన్ హీరోయిన్ గా మాత్రమే సినిమాలు చేస్తానంటుంది.లేదంటే జైలర్ ఇచ్చిన ఎక్స్ పీరియన్స్ తో టాప్ హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్ తో ఎడ్జెస్ట్ అవుతానంటుంది.

ఇక కేతికశర్మ తెలుగులో తనకు లైఫ్ వస్తుందనే ఆశపడుతుంది. బ్రో సినిమాలో కేతిక చేసిన రోల్ కు ప్రయారిటీ తక్కువే అయినా… ఓకే అనిపించుకుంది.ఇక తన తర్వాత సినిమాలపై క్లారిటీ లేని ఈ ఢిల్లీ బ్యూటీటైమ్ బాగుంటే తెలుగులో సెకండ్ హీరోయిన్ గా నైనా బ్రేక్ తెచ్చుకుంటానని చెబుతుంది. అది ఎంతవరకు పాజిబుల్ అవుతుంది అన్నది ఇంకో ఒకటి రెండు సినిమాలతో తెలుగులోమెరిస్తేగాని చెప్పలేం.

Exit mobile version