NTV Telugu Site icon

Aha Naa Pellanta Trailer:పెళ్లి పీటలు మీద పెళ్లి ఆగిపోతే ఆ పెళ్ళికొడుకు బాధ ఎలా ఉంటుందో తెలుసా..?

Raj

Raj

Aha Naa Pellanta Trailer: కుర్ర హీరో రాజ్ తరుణ్ ప్రస్తుతం ఓటిటీని నమ్ముకున్నాడు. ప్రేక్షకులు థియేటర్ కన్నా ఓటిటీనే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో కుర్ర హీరోలు సైతం తమ రూట్ మారుస్తున్నారు. తాజాగా రాజ్ తరుణ్, శివాని రాజశేఖర్ జంటగా నటిస్తున్న చిత్రం అహ నా పెళ్ళంట. సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం జీ 5 లో రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన టీజర్, పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ట్రైలర్ ఆద్యంతం వినోదాన్ని పంచుతోంది. చిన్నతనం నుంచి కొడుకు ఏ అమ్మాయి వెంటపడినా తండ్రికే ఏదో ఒక గండం వస్తూ ఉంటుంది. దీంతో హీరో.. అమ్మాయిలను దూరం పెడుతూ వస్తాడు. ఇక హీరోకు పెళ్లీడు వయసు వచ్చాకా సంబంధాలు చూసి చూసి విసిగిపోయి చివరికి ఒక సంబంధం సెట్ చేస్తారు పెద్దలు.

అహ నా పెళ్ళంట అని హీరో సంబరపడేలోపే పెళ్లి కూతురు పీటల మీద నుంచి పారిపోతోంది. దీంతో హీరో బాధలో కూరుకుపోతాడు. ఆ సమయంలోనే హీరోయిన్ పరిచయమవుతోంది. పెళ్ళికి ముందే ఈ జంట ఒక ఇంట్లో ఉండాల్సి వస్తుంది. దాని తరువాత జరిగిన పరిణామాలు ఏంటి..? అసలు వీరిద్దరూ ఎందుకు ఒకే ఇంట్లో ఉండాల్సి వచ్చింది. వీరి వల్ల వీరి కుటుంబాలు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారు అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. రాజ్ తరుణ్, శివాని మధ్య కెమిస్ట్రీ చాలా బాగా కుదిరింది. ఇక ఈ సినిమా నవంబర్ 17 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా రాజ్ తరుణ్ కు ఎలాంటి విజయాన్ని అందివ్వనున్నదో చూడాలి.

Show comments