Nenu Super Woman: ”ఆహా” అనిపిస్తున్న ”నేను సూపర్ ఉమన్”..3 వారాల్లో 3 కోట్ల 90 లక్షల పెట్టుబడులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nenu Super Woman Getting Huge Response: “ప్రశ్నించనిదే సమాధానం దొరకదు… ప్రయత్నించందే విజయము దక్కదు,” అన్నారు మన బి ఆర్ అంబేద్కర్. అలా ప్రశ్నించి, ప్రయత్నించి మన ముందు స్టార్ మహిళగా నిలిచారు, మన ఆహా వారి ‘నేను సూపర్ వుమెన్’ మహిళా వ్యాపార వేత్తలు. ఎంతో మందిని ఆకర్షించిన ఈ షో మూడో వారంలో అడుగుపెడుతుంది. ఈ వారంలో ఏంజెల్స్ 90 లక్షలు ఇన్వెస్ట్ చేశారు. ఇప్పటికి వరకు మన వుమెన్ స్టార్ట్ అప్ కంపెనీస్ లో ఏంజెల్స్ 3 కోట్ల 90 లక్షలు (1 , 2 మరియు 3 వారాలు కలిపి) ఇన్వెస్ట్ చేశారు.
Kodali Nani: దాడి చేస్తే ఊరుకోం… పవన్ పై కొడాలి నాని షాకింగ్ కామెంట్స్..
Also Read
- Jharkhand Protest: జార్ఖండ్ నిరసనల్లో ‘పుష్ప’.. విద్యార్థుల ఆందోళనలో వైరల్‌గా మారిన యువకుడు!
- Manchu Manoj: సినిమాకు కులం, గోత్రం ఉండదు.. మంచు మనోజ్ సంచలన కామెంట్స్ వైరల్!
- Varanasi: మహేష్ బాబు బర్త్‌డే రోజు రాజమౌళి ఎందుకు సైలెంట్? ‘వారణాసి’పై జక్కన్న మాస్టర్ ప్లాన్ ఇదేనా?
- AR Ameen: రెహమాన్ కొడుక్కి తృటిలో తప్పిన ముప్పు!
లావణ్య సూన్కారి – ఫౌండర్ అఫ్ లారిక్
అమ్మ మొదటి గురువు. అలా అమ్మ చెప్పిన మాటలు విన్నీ, తనదైన దారిని తీర్చిదిద్దుకుంది లావణ్య. 26 ఏళ్లకే ఫార్చ్యూన్ 500 కంపెనీకి మార్కెటింగ్ హెడ్ గా బాధ్యతలు నిర్వహించి, ప్రస్తుతం 32 ఏళ్ళకి లారిక్ కంపెనీ ని స్థాపించింది. అమ్మ పాలు ఎంత స్వచ్ఛమైందో, లారిక్ యొక్క హెల్త్ సుప్ప్లీమెంట్స్ అంతే స్వచ్చమైనవి అంటుంది ఈ స్టాన్ఫోర్డ్ యూనివర్సటి న్యూట్రిషన్ స్పెషలిస్ట్. 36 ,000 మంది కస్టమర్స్ ఉన్న ఈ కంపెనీ కి అమెరికా నుంచి క్లీన్ లేబిల్ సర్టిఫైడ్ బ్రాండ్ అని కూడా పొందింది. అలా పొందిన కంపెనీస్ లో భారత దేశంలో మూడు మాత్రమే ఉన్నాయి. అందులో ఒకటి లారిక్. ఇప్పుడు ఆహా నేను సూపర్ వుమెన్ షో కి 70 లక్షలకి 2 % వాటా కి అడుగుతూ వచ్చింది లావణ్య. తన పట్టుదల చూసి మెచ్చిన ఏంజెల్స్ రేణుక బొడ్ల , కరణ్ బజాజ్ 50 లక్షలకి 4 % వాటా అడిగారు. దానికి లావణ్య ఒప్పుకున్నారు.
మాధురి ఆకెళ్ళ – ఫౌండర్స్ అఫ్ సెకండ్ ఇన్నింగ్స్
అమ్మ ఒడి, గుడి కన్నా చాలా ప్రశాంతతను ఇస్తుంది. కానీ, అలాంటి తలితండ్రులను మనం ఒంటరిగా ఇంట్లో వదిలేసి బయటకు వెళ్లిపోతాం. అలాంటి వాళ్ళ ఒంటరి తనని దూరం చేయడానికి వచ్చిందే – ఈ సెకండ్ ఇన్నింగ్స్. మాధురి చేత రన్ చేయబడుతున్న ఈ సెకండ్ ఇన్నింగ్స్ కంపెనీ లో పొద్దున 9 ఇంటి నుంచి సాయంత్రం 5 గంటల వరకు , ఒక్క రోజు నుంచి ఆరు మాసాలు వరకు ఉండచ్చు. అయితే ఇది వృద్ధాశ్రమం కాదు. ఒక డే కేర్ సెంటర్ ఇది. ఇక్కడ యోగ, ఇండోర్ గేమ్స్, మొబిలిటీ థెరపీ మరియు వృద్ధుల యొక్క హొబ్బిఎస్ ని కూడా వీలు చూసుకుంటారు. అలా మరోసారి వృద్ధాప్యంలో అమ్మ ఒడిని చవిచూపిస్తున సెకండ్ ఇన్నింగ్స్ మాధురి గారు 40 లక్క్షలకి 20 % వాటాకు అడగగా, Dr సింధూర నారాయణ 20 లక్షలకి 15 % వాటా ఆఫర్ చేయగా, డీల్ ని ఇరువురు ఒప్పుకున్నారు.
ప్రత్యూష – ఫౌండర్ అఫ్ గ్రెయిల్ మేకర్స్ ఇన్నోవేషన్స్
“సర్వేంద్రియానాం నయనం ప్రధానం” అన్నారు పెద్దలు. అందుకే 26 ఏళ్ళ ప్రత్యూష గ్రెయిల్ మేకర్స్ ఇన్నోవేషన్స్ తో మన ముందుకు వచ్చారు. చిన్నపుడు డిస్లెక్సియా తో ఆమె బాధపడ్డారు. అలా తనలా బాధ పడే వారికి చేయూతగా నిలవాలి అని ఎల్ వి ప్రసాద్ కంటి ఆసుపత్రిలో వాలంటీర్ గా పని చేశారు. అప్పుడే విజువల్ ఇంపైర్డ్ అయిన ఐశ్వర్య పరిచయమైంది. వారి స్నేహం నుంచి వచ్చిన కంపెనీ గ్రెయిల్ మేకర్స్. ప్రత్యూష రెండు ప్రొడక్ట్స్ చేశారు – విసిఒన్ నానీ (చిన్నపిల్లలా కోసం) మరియు స్పేస్ ఫెల్ట్ (పెద్దవాళ్ళ కోసం). స్పేస్ ఫెల్ట్ ద్వారా, ఒక క్యూర్ కోడ్ ని స్కాన్ చేస్తే ఆ రూమ్ లో లేదా ఒక ప్రోడక్ట్ గురించి వివరాలు వస్తాయి. ప్రత్యూష సూపర్ ఉమెన్ షో కి వచ్చి 50 లక్షలు 5 % వాటా కు కోరగా, ఏంజెల్ సింధూర నారాయణ 20 లక్క్షలు 20 % వాటాకు ఒప్పుకున్నారు.
నిష్క అగర్వాల్ – ఫౌండర్ ఆఫ్ సెప్టెంబర్ షూస్:
పెళ్లి రెండు జీవితాలనే కాదు, రెండు కుటుంబాలని కూడా ఒకటి చేస్తాయి. అలాంటి ఒక సంబరానికి ఎంతో షాపింగ్ జరుగుతుంది. కానీ చెప్పుల షాపింగ్? మనం వేసుకునే చెప్పులు డాన్స్ చేస్తూ విరిగిపోతే? అలాంటివి జరగకుండా, మన వెయిట్ , మనకు నచ్చినట్టు కస్టమైజ్ చేసుకునే వెడ్డింగ్ ఫుట్ వేర్- సెప్టెంబర్ షూస్. ఇలాంటి ఒక ప్రాజెక్టు భారత దేశంలోనే మొట్ట మొదటి సారి చేయబడుతోంది. నిష్క ఈ షో లో 50 లక్షలు 15 % వాటాకి కోరగా, ఏంజెల్స్ ఇన్వెస్ట్మెంట్ కాకుండా మెంటార్ షిప్ అందించడానికి ఒప్పుకున్నారు. ఏంజెల్స్ సింధూర నారాయణ, కరణ్ బజాజ్ మెంటార్ షిప్ ఇస్తానని చెప్పగా, నిష్క దానికి ఒప్పుకున్నారు.
తాజావార్తలు
-
Jharkhand Protest: జార్ఖండ్ నిరసనల్లో ‘పుష్ప’.. విద్యార్థుల ఆందోళనలో వైరల్‌గా మారిన యువకుడు!
-
AP Rain Alert: ఏపీలో రానున్న మూడు గంటలు పిడుగుపాటు హెచ్చరిక.. ఈ జిల్లాల వారు జాగ్రత్త..
-
Varuna Yagam : ముగిసిన వరుణయాగం.. పాల్గొన్న సీఎం రేవంత్ దంపతులు
-
Kumari Aunty: సినిమాల్లోకి వస్తానని ఎప్పుడూ అనుకోలేదు!
-
Director Arrested: డ్రింక్ లో మత్తుమందు ఇచ్చి రేప్.. దర్శకుడు అరెస్ట్
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!