Site icon NTV Telugu

Anil Sunkara: తప్పు చేశాం.. క్షమించండి.. ‘ఏజెంట్’ ఫెయిల్యూర్ ను ఒప్పుకున్న నిర్మాత

Anil

Anil

Anil Sunkara: సినిమా ఇండస్ట్రీలో ఉన్నవారికి విజయాలు, అపజయాలు సాధారణం. అన్నిసార్లు విజయాలను అందుకోవాలని లేదు. కొన్నిసార్లు పరాజయాలను కూడా నిజాయితీగా ఒప్పుకున్నవారే.. పైకి ఎదగగలుగుతారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న ట్రెండ్ ఏంటంటే.. హిట్ అయితే హీరోను ఎత్తేస్తున్నారు.. అదే ప్లాప్ అయితే డైరెక్టర్ ను ఏకిపారేస్తున్నారు. ఎప్పటి నుంచో ఇదే ట్రెండ్ నడుస్తోంది. ముఖ్యంగా తెలుగులో ఇది ఈ మధ్య ఎక్కువగా కనిపిస్తోంది. గతేడాది ఆచార్య రిలీజ్ అయ్యి ప్లాప్ అందుకుంటే.. డైరెక్టర్ కొరటాల శివను ఏకిపారేశారు. కథ ఎలా ఉంటుందో తెలియదా ..? డైరెక్షన్ చేసేది ఇలాగేనా అంటూ ట్రోల్ చేశారు. అంతకుముందు ఒక్క పరాజయం కూడా అందుకొని దర్శకుడు.. ఒక్కసారి ప్లాప్ అందుకుంటే.. అతడి డైరెక్షన్ మొత్తాన్ని తప్పు పట్టారు.

Conductor Jhansi: చైతన్య ఆత్మహత్యకు వాళ్ళే కారణం.. సంచలన నిజాలు చెప్పిన కండక్టర్ ఝాన్సీ

ఇక ఇప్పుడు అదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు సురేందర్ రెడ్డి. కిక్, రేసు గుర్రం లాంటి ఇండస్ట్రీ హిట్లు ఇచ్చిన సురేందర్ రెడ్డి.. రెండేళ్లుగా ఏజెంట్ ను చెక్కుతూ వచ్చాడు. అఖిల్ అక్కినేనిని ఏజెంట్ గా మార్చడానికి అతడెంత కష్టపడ్డాడో అందరికి తెల్సిందే. అయితే ఏజెంట్.. ఏప్రిల్ 28 న రిలీజ్ అయ్యి.. భారీ పరాజయాన్ని మూటకట్టుకుంది. ఈ సినిమా కోసం అఖిల్ పడిన కష్టం మొత్తం బూడిదలో పోసిన పన్నీరు అయ్యింది. ఇక ఈ సినిమా పరాజయం పాలవ్వడంతో సురేందర్ రెడ్డిని అక్కినేని అభిమానులు ట్రోల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏజెంట్ ప్లాప్ నిందను మేము భరిస్తున్నామని ప్రొడ్యూసర్ అనిల్ సుంకర ట్వీట్ చేయడం నెట్టింట వైరల్ గా మారింది.

Rajamouli: రాజమౌళికి పాకిస్థాన్ వాళ్లు పర్మిషన్ ఇవ్వలేదట…

” ఏజెంట్‌ ప్లాప్ కు కారణం మేమే అని ఒప్పుకుంటున్నాం. ఇది ఒక పెద్ద పని అని మాకు తెలిసినప్పటికీ, మేము దానిని జయించాలని అనుకున్నాము, కానీ మేము బౌండ్ స్క్రిప్ట్ లేకుండా ప్రాజెక్ట్‌ను ప్రారంభించడంలో పొరపాటు జరిగింది. అంతేకాకుండా కోవిడ్‌ సమయంలో కొన్ని సమస్యలు వచ్చాయి. వాటిని అధిగమించి మేము చేసిన కొన్ని పనులు విఫలమయ్యాయి. ఇది చాలా కాస్ట్లీ తప్పు. దీనివలన మేము చాలా నేర్చుకున్నాం. అయితే సినిమా ప్లాప్ అయ్యిందని ఎలాంటి సాకులు చెప్పాలనుకోవడం లేదు. కాకపోతే ఇంకోసారి ఇలాంటి తప్పు జరగదు అని మాత్రం హామీ ఇస్తున్నాం. మాపై నమ్మకం ఉంచిన వారందరికీ మా హృదయపూర్వక క్షమాపణలు. మేము మా భవిష్యత్ ప్రాజెక్ట్‌లలో అంకితమైన ప్రణాళిక & కష్టపడి నష్టాలను భర్తీ చేస్తాము” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.

Exit mobile version