Site icon NTV Telugu

Agent: అక్కినేని అఖిల్ గర్ల్ ఫ్రెండ్ అదిరిపోయింది..

Agent

Agent

‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రంతో డీసెంట్ హిట్ అందుకున్నాడు అక్కినేని హీరో అఖిల్. ఇక ఈ సినిమా తరువాత అఖిల్, సురేదెర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ మూవీని పట్టాలెక్కించాడు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రంలో అఖిల్ సరసన కన్నడ బ్యూటీ సాక్షి వైద్య నటిస్తుండగా.. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టీ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి తాజాగా హీరోయిన్ సాక్షి ఫస్ట్ లుక్ పోస్టర్ నుం రిలీజ్ చేశారు. నేడు సాక్షి వైద్య పుట్టినరోజు జరుపుకోవడంతో ఆమె ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసి మేకర్స్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది.

పోస్టర్ లో అల్ట్రా స్టైలిష్ లుక్ లో సాక్షి అదరగొడుతోంది. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమా లో అఖిల్ గర్ల్ ఫ్రెండ్ గా అమ్మడు నటిస్తోంది. ఇక ఏజెంట్‌ సినిమా వరల్డ్‌వైడ్‌గా ఆగస్టు 12న విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఇదిలా ఉంటే ఈ మూవీ హాలీవుడ్‌ సూపర్‌ హిట్‌ మూవీ సిరీస్‌ ‘బోర్న్‌’ ఆధారంగా తెరకెక్కనున్నదని సమాచారం. ప్రముఖ రచయిత వక్కంతం వంశీ ఈ చిత్రానికి కథను అందించాడు. మరి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రం తో మొదటి హిట్ ను అందుకున్న అఖిల్ ఈ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ల్లో విజయాన్ని అందుకుంటాడేమో చూడాలి.

Exit mobile version