Agent: అఖిల్ చిత్రం విడుదల వాయిదా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రామిసింగ్ హీరో అఖిల్ అక్కినేని, స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో, హై బడ్జెట్ స్టైలిష్, యాక్షన్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకుంటోంది ‘ఏజెంట్’ చిత్రం. ఈ మూవీలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి పవర్ ఫుల్ క్యారెక్టర్ చేస్తున్నారు. సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోంది. దేశభక్తి అంశాలతో రూపుదిద్దుకుంటున్న సినిమా కాబట్టి దీన్ని ఆగస్ట్ 12న విడుదల చేయాలని దర్శక నిర్మాతలు తొలుత భావించారు. అయితే సినిమా షూటింగ్ లో జాప్యం జరుగుతున్న కారణంగా ఆ రోజున విడుదల కాకపోవచ్చునని తెలుస్తోంది. ఇప్పటికే ఆగస్ట్ 11న ఆమీర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్దా’, 12న సమంత ‘యశోద’ చిత్రాలు విడుదల కానున్నాయి. తాజాగా 12వ తేదీన నితిన్ ‘మాచర్ల నియోజకవర్గం’ కూడా రిలీజ్ అవుతుందని ఆ చిత్ర నిర్మాత తెలిపారు. అతి త్వరలోనే ‘ఏజెంట్’ నిర్మాతలు సరికొత్త విడుదల తేదీని అధికారికంగా ప్రకటిస్తారని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.
‘ఏజెంట్’ మూవీ కోసం అఖిల్ సూపర్ మేకోవర్ చేశాడు. ఈ చిత్రంలో యాక్షన్ ప్యాక్డ్ రోల్ లో అఖిల్ కనిపించబోతున్నాడు. ఈ స్పైథ్రిల్లర్ మూవీని ఎకె ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. వక్కంతం వంశీ ఈ చిత్రానికి కథను అందించారు. సెన్సేషనల్ కంపోజర్ హిప్ హాప్ తమిళ స్వరాలు సమకూర్చగా, రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా, అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. అజయ్ సుంకర, పతి దీప రెడ్డి ఈ చిత్రానికి సహ నిర్మాతలు.
Also Read
తాజావార్తలు
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Naga Vamsi: మీకు భయపడే సినిమా రిలీజ్ ఆపాం.. నాగవంశీ ఓపెన్ కామెంట్స్!
-
Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
-
Sivakarthikeyan: దళపతి బాటలోనే శివకార్తికేయన్? హీరోల ‘ఫ్యాన్స్ మీట్’ల వెనుక అసలు ప్లాన్ అదేనా!
-
Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?