Site icon NTV Telugu

Agent: అఖిల్ చిత్రం విడుదల వాయిదా!

Agent

Agent

ప్రామిసింగ్ హీరో అఖిల్ అక్కినేని, స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో, హై బడ్జెట్ స్టైలిష్, యాక్షన్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకుంటోంది ‘ఏజెంట్‌’ చిత్రం. ఈ మూవీలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి పవర్ ఫుల్ క్యారెక్టర్ చేస్తున్నారు. సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోంది. దేశభక్తి అంశాలతో రూపుదిద్దుకుంటున్న సినిమా కాబట్టి దీన్ని ఆగస్ట్ 12న విడుదల చేయాలని దర్శక నిర్మాతలు తొలుత భావించారు. అయితే సినిమా షూటింగ్ లో జాప్యం జరుగుతున్న కారణంగా ఆ రోజున విడుదల కాకపోవచ్చునని తెలుస్తోంది. ఇప్పటికే ఆగస్ట్ 11న ఆమీర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్దా’, 12న సమంత ‘యశోద’ చిత్రాలు విడుదల కానున్నాయి. తాజాగా 12వ తేదీన నితిన్ ‘మాచర్ల నియోజకవర్గం’ కూడా రిలీజ్ అవుతుందని ఆ చిత్ర నిర్మాత తెలిపారు. అతి త్వరలోనే ‘ఏజెంట్’ నిర్మాతలు సరికొత్త విడుదల తేదీని అధికారికంగా ప్రకటిస్తారని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.

‘ఏజెంట్’ మూవీ కోసం అఖిల్ సూపర్ మేకోవర్ చేశాడు. ఈ చిత్రంలో యాక్షన్ ప్యాక్డ్ రోల్ లో అఖిల్ కనిపించబోతున్నాడు. ఈ స్పైథ్రిల్లర్ మూవీని ఎకె ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. వక్కంతం వంశీ ఈ చిత్రానికి కథను అందించారు. సెన్సేషనల్ కంపోజర్ హిప్ హాప్ తమిళ స్వరాలు సమకూర్చగా, రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా, అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. అజయ్ సుంకర, పతి దీప రెడ్డి ఈ చిత్రానికి సహ నిర్మాతలు.

Exit mobile version