NTV Telugu Site icon

Thug Life: ఆఖరికి సిద్దార్థ్ కూడానా.. అసలు ఏం జరుగుతోంది భయ్యా?

Siddharth Crying At Chinna Pressmeet

Siddharth Crying At Chinna Pressmeet

Siddharth out From Thug Life:”కమల్ హాసన్ హీరోగా మణిరత్నం తెరకెక్కిస్తున్న ‘తగ్ లైఫ్’ నుంచి ఇప్పటికే దుల్కర్ సల్మాన్, జయం రవిలు తప్పుకున్నారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ముందు దుల్కర్ డేట్స్ కుదరక తాను సినిమా చేయలేనని చెప్పగా తరువాత జయం కూడా తప్పుకుంటున్నట్టు చెప్పినట్టు ప్రచారం జరిగింది. ఇక ఈ వార్తలు రావడంతో ఈ సినిమాలో కమల్ ఒక్కరే ఉంటారా అని కూడా నెటిజన్లు ఎగతాళి చేస్తున్నారు. దుల్కర్ సల్మాన్ తన డేట్స్ తీసుకుని వాటిని వృధా చేశారని చెప్పి ‘తగ్ లైఫ్’ నుండి వాకౌట్ చేయగా, అదే కారణంతో జయం రవి కూడా వాకౌట్ చేశాడు. ఆ తర్వాత దుల్కర్ సల్మాన్‌కు బదులుగా శింబు, జయం రవికి బదులుగా అరవింద్‌సామిని ఎంపిక చేసినట్లు సమాచారం.

Ram Charan : భార్య, కూతురుతో చెన్నై కి రామ్ చరణ్.. న్యూ లుక్ అదిరిందిగా..

ఇక ఇప్పుడు తప్పుకున్న ఇద్దరు చెప్పిన కారణంతోనే నటుడు సిద్ధార్థ్ తగ్ లైఫ్ సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. మణిరత్నం సిద్ధార్థ్‌ను తన గురువుగా భావించి అదే విషయాన్నీ చెబుతూ ఉంటాడు. అలాంటి సిద్ధార్థ్ తన గురువు సినిమా నుండి వైదొలగడం పెద్ద షాక్‌కు గురి చేసింది. ప్రస్తుతం మూడు సినిమాల్లో హీరోగా నటించేందుకు కమిట్ అయినందున ఇకపై తన కాల్షీట్ వేస్ట్ చేయలేనని సిద్ధార్థ్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే ‘తగ్ లైఫ్’ నుంచి సిద్ధార్థ్ వైదొలిగినట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించకపోవడం గమనార్హం. ‘తగ్ లైఫ్’ నుంచి ఒక్కొరొక్కరుగా నటులు దూరమవుతుంటే కమల్ అన్ని పాత్రల్లోనూ ‘దశావతారం’లా నటించాల్సి వస్తుందని కొందరు కామెంట్ చేస్తున్నారు.

Show comments