NTV Telugu Site icon

Naga Chaitanya : యేటలో చేపలు పట్టేసాక..మంచి పులుసు ఎట్టేయాలి కదా

Thandel

Thandel

నాగ చైత‌న్య లేటెస్ట్ చిత్రం తండేల్‌. కార్తికేయ-2 వంటి బ్లాక్ బస్టర్ ను తెరకెక్కించిన దర్శకుడు చందు మొండేటి దర్శకత్వంలో రానుంది తండేల్. ఏపీకి చెందిన కొంత మంది జాలర్లు స‌ముద్రంలో చేప‌ల వేట‌కు వెళ్లి, అనుకోకుండా పాకిస్థాన్ బోర్డ‌ర్‌లోకి ప్ర‌వేశిస్తారు. వారిని అక్కడ పాకిస్థాన్ నేవీదళం అరెస్ట్ చేయడం, అక్కడ ఎలాంటి ప‌రిస్థితుల‌ను ఎదుర్కొన్నారు, ఎలా బ‌య‌ట‌ప‌డ్డార‌నే క‌థాంశంతో తండేల్ మూవీ తెర‌కెక్కుతోంది. ల‌వ్ స్టోరీ సినిమా తర్వాత నాగ చైత‌న్య‌, సాయి ప‌ల్ల‌వి చేస్తున్నరెండవ సినిమా ఇది.

Also Read : DaakuMaharaaj : డాకు మహారాజ్ 5వ రోజు AP/TG కలెక్షన్స్.. మాస్ పవర్

ఈ సినిమా కోసం శశ్రీకాకుళం యాస నేర్చుకునిమరి నటిస్తున్నాడు నాగ చైతన్య. ఈ సినిమా ఎక్కువ భాగం ఉత్తరాంధ్ర ముఖ్యంగా విశాఖపట్నం, శ్రీకాకుళం ప్రాంతాలలో షూట్ చేసారు మేకర్స్. అయితే ఈ సినిమా షూట్ సమయంలో నాగ చైతన్య విశాఖపట్నంలోని అక్కడి స్థానికులతో మాట్లాడుతూ తండేల్ సినిమా షూట్ ఫినిష్ చేసే లోగా తానే స్వయంగా ఉత్తరాంధ్ర వారి స్టైల్‌లో చేపల పులుసు వండి పెడతానని మాటిచ్చాడు చైతన్య అయితే ఈ సినిమా షూట్ చివరి దశకు చేరుకోవడంతో ఇచ్చిన మాట ప్రకారం స్వయంగా నాగ చైతన్య చేపల పులుసు వండి అక్కడి స్థానికులకు వడ్డించారు. ఇందుకు సంబంధించిన స్పెషల్‌ వీడియోను చిత్ర నిర్మాణ సంస్థ గీత ఆర్ట్స్ తాజాగా విడుదల చేసింది. నాగ చైతన్య కెరీర్ లోనే హయ్యెస్ట్ బడ్జెట్ సినిమాగా తండేల్ నిర్మిస్తున్నారు మేకర్స్. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలోని సాంగ్స్ కు అద్భుత స్పందన లభించింది. అన్ని హంగులు పూర్తి చేసుకుని ఫిబ్రవరి 7న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతోంది తండేల్.