Adult star Kagney Linn Karter Dies by Suicide: హాలీవుడ్ సినీ ఇండస్ట్రీ నుంచి ఓ విషాదకర వార్త వెలువడుతోంది. అదేమంటే 36 ఏళ్ల అమెరికన్ పోర్న్ ఫిల్మ్ స్టార్ కాగ్నీ లిన్ కార్టర్ కన్నుమూశారు. అందుతున్న సమాచారం మేరకు కాగ్నీ ఆత్మహత్య చేసుకుని మరణించింది. కాగ్నీ మరణ వార్తను ఆమె స్నేహితులు సోషల్ మీడియాలో పంచుకున్నారు. కాగ్నీ లిన్ కార్టర్ స్టార్‌డమ్‌ను మాత్రమే కాదు పలు అవార్డులు కూడా సంపాదించింది. ఆమె గురువారం (ఫిబ్రవరి 15) కుయాహోగా కౌంటీలో ఆత్మహత్య కారణంగా మరణించినట్లు TMZ రిపోర్ట్ చేసింది. ఆమె ఎలా చనిపోయింది అనే విషయం వెలుగులోకి రాలేదు కానీ చనిపోయిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పార్మా పోలీస్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి ప్రకారం, ఆమెకు మంచి కెరీర్ అలాగే టాలెంట్ ఉన్నప్పటికీ, కాగ్నీ లిన్ కార్టర్ గత ఏడాది కాలంగా మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని చెబుతున్నారు.
Varun Tej: సైలెంటుగా సిద్ధార్థ్ ఆనంద్ కి కౌంటర్ ఇచ్చిన వరుణ్ తేజ్
ఇక కాగ్నీ స్నేహితులు మానసిక ఆరోగ్య సమస్యల గురించి అవగాహన పెంచడానికి సోషల్ మీడియాలో ప్రచారం కూడా నిర్వహించారు. అంతేకాక కాగ్నీ లిన్ కార్టర్ తల్లికి ఆర్థికంగా మద్దతు ఇవ్వాలని కూడా ప్రజలను కోరారు, తద్వారా ఆమె తన కుమార్తె అంత్యక్రియలను నిర్వహించవచ్చని చెబుతున్నారు. కాగ్నీ లిన్ కార్టర్ టెక్సాస్‌లోని హారిస్ కంట్రీలో జన్మించారు. కార్టర్ మిస్సౌరీలో పోర్న్ స్టార్ వృత్తిలో దిగింది. ఆ తర్వాత కాగ్నీ సింగింగ్ , యాక్టింగ్ నటనలో వృత్తిని కొనసాగించడానికి కాలిఫోర్నియాకు వచ్చారు. 2008లో పోర్న్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఆమె జానీ సిన్స్‌తో ‘నాటీ అమెరికా’లో ఆమె తన మొదటి పోర్న్ మూవీ షూట్ చేసింది. జానీ సిన్స్ పోర్న్ ఇండస్ట్రీలో అతి పెద్ద స్టార్. ఇటీవల రణవీర్ సింగ్‌తో పురుషుల లైంగిక జీవితంపై బ్రాండ్ వీడియోను చిత్రీకరించగా అది చర్చనీయాంశం అయింది. ఇక 2018 సంవత్సరంలో, కాగ్నీ నైట్ మూవ్స్ అనే అవార్డుతో కూడా సత్కరించబడింది. అయితే ఆమె అంత్యక్రియలకు కూడా డబ్బు లేక ఆమె తల్లి గో ఫండ్ మీ ద్వారా డబ్బు సేకరించడం బాధ కరమైన విషయం.