Site icon NTV Telugu

Adivi Sesh : స్టార్‌ డైరెక్టర్స్‌ స్టార్స్‌ను మాత్రమే డైరెక్ట్‌ చేస్తారా?

Adivi Sesh

Adivi Sesh

టాలీవుడ్‌లో స్టార్ డైరెక్టర్లు ఎప్పుడూ స్టార్ హీరోల వెంటే ఉంటారు. మరి టాలెంటెడ్ యంగ్ హీరోల పరిస్థితి ఏమిటి? తాజాగా తన సినిమా ‘డెకాయిట్’ ప్రమోషన్స్‌లో భాగంగా హీరో అడివి శేష్ ఈ విషయంపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. “మీరు ఎందుకు స్టార్ డైరెక్టర్లతో పని చేయడం లేదు?” అని అడిగిన ప్రశ్నకు శేష్ చాలా ప్రాక్టికల్‌గా సమాధానమిచ్చారు. “టాలీవుడ్‌లో ఒక ఆరుగురు స్టార్ హీరోలు ఉన్నారు. స్టార్ డైరెక్టర్లందరూ కేవలం ఆ ఆరుగురితోనే సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తారు. ఇదొక వలయంలా తిరుగుతూ ఉంటుంది. వారిది ఒక ‘గెలాక్సీ’ అయితే, మాది ‘ఎర్త్’. అక్కడ స్థలం దొరకడం చాలా కష్టం” అని శేష్ పేర్కొన్నారు. అంటే, టాప్ లీగ్ డైరెక్టర్లు తమ తదుపరి ప్రాజెక్టుల కోసం మళ్లీ మళ్లీ అదే స్టార్ హీరోల కాల్షీట్ల కోసం వేచి చూస్తారే తప్ప, యంగ్ హీరోల వైపు చూడటం లేదని ఆయన మాటల సారాంశం.

Also Read :Raaka: అల్లు అర్జున్ ‘రాకా’ లో ‘శివగామి’.. ఫస్ట్ లుక్‌తోనే సెన్సేషన్!

పరిశ్రమలోని అగ్ర దర్శకులందరి ట్రాక్ రికార్డ్ చూస్తే శేష్ చెప్పింది అక్షర సత్యమనిపిస్తుంది. రాజమౌళి మూడేళ్లకు ఒక సినిమా తీసినా, అది కచ్చితంగా ఒక పెద్ద స్టార్‌తోనే ఉంటుంది. గ్లోబల్ రేంజ్‌కు వెళ్లాక ఇక యంగ్ హీరోల వైపు చూసే ఛాన్సే లేదు. సుకుమార్ గత కొన్నేళ్లుగా మెగా హీరోల చుట్టూనే తన కథలను తిప్పుతున్నారు. బన్నీ, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు.. ఈ ముగ్గురిని దాటి త్రివిక్రమ్ కలం బయటకు రావడం లేదు. నాగ్ అశ్విన్ & సందీప్ వంగా మొదటి సినిమాలతోనే గుర్తింపు తెచ్చుకున్నా, ఇప్పుడు వీరు కూడా కేవలం పాన్ ఇండియా స్టార్లతోనే పని చేస్తున్నారు. కెరీర్ ఆరంభంలో యంగ్ హీరోలతో వరుస హిట్లు కొట్టిన అనిల్ రావిపూడి కూడా ఇప్పుడు రూటు మార్చారు. గత కొన్నేళ్లుగా ఆయన కేవలం సీనియర్ స్టార్ హీరోలను డైరెక్ట్ చేయడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. దీనివల్ల ప్రతిభ ఉన్న యంగ్ హీరోలు సొంతంగా కథలు రాసుకోవడమో లేదా కొత్త దర్శకులను నమ్ముకోవడమో చేయాల్సి వస్తోంది. ఏప్రిల్ 10న విడుదల కాబోతున్న ‘డెకాయిట్’పై అడివి శేష్ చాలా ధీమాగా ఉన్నారు. స్టార్ డైరెక్టర్లు లేకపోయినా, తనదైన స్క్రీన్ ప్లే, కంటెంట్‌తో బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేయవచ్చని ఆయన ఇదివరకే ‘క్షణం’, ‘గూఢచారి’, ‘మేజర్’ సినిమాలతో నిరూపించారు. మరి ‘డెకాయిట్’ తో శేష్ ఆ ‘గెలాక్సీ’ వైపు అడుగులు వేస్తారేమో చూడాలి!

Exit mobile version