Site icon NTV Telugu

Adivi Sesh: EXని ఇంట్రడ్యూస్ చేసిన శేష్…

Adivi Sesh

Adivi Sesh

‘శేష్ జానర్’ అనే జానర్ ని తనకంటూ స్పెషల్ గా క్రియేట్ చేసుకోని సినిమాలు చేస్తున్నాడు అడివి శేష్. థ్రిల్లర్ సినిమాలతో ఎడ్జ్ ఆఫ్ ది సీట్ లో ఆడియన్స్ కూర్చునేలా చేసే అడివి శేష్… ప్రస్తుతం గూఢచారి 2 మూవీతో బిజీగా ఉన్నాడు. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ తో పాటు మరో సినిమా చేస్తున్నాడు అడివి శేష్. ఇటీవలే అనౌన్స్ చేసిన ఈ మూవీని శేష్exశృతి అనే హ్యాష్ ట్యాగ్ తో అడివి శేష్ అనౌన్స్ చేసాడు. శృతి హాసన్ మొదటిసారి శేష్ పక్కన హీరోయిన్ గా నటిస్తోంది. ఇంకా టైటిల్ ఫిక్స్ చేయని ఈ పాన్ ఇండియా మూవీని షానీల్ దేవ్ డైరెక్ట్ చేస్తున్నాడు. శేష్ తో ఎక్కువ రోజులుగా ట్రావెల్ అవుతూ… క్షణం, గూఢాచారి లాంటి సినిమాలకు షానీల్ డీఓపీగా వర్క్ చేసాడు. డైరెక్టర్ గా డెబ్యూ అవుతున్న షానీల్, గతంలో లైలా అనే షార్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేశాడు. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కు ఈ షార్ట్ ఫిల్మ్ అధికారికంగా ఎంపికైంది. ఈ తాజా పాన్ ఇండియా సినిమాకు స్టోరీ, స్క్రీన్ ప్లేను షనీల్, అడివి శేష్ కలిసి చేయనున్నారు.

అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో సుప్రియ యార్లగడ్డ సినిమాను తెరకెక్కిస్తోంది. సునీల్ నారంగ్ సినిమాకు కోప్రొడ్యూసర్ గా ఉన్నాడు. ఈ మూవీకి సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్ త్వరలోనే రానున్నాయి. డిసెంబర్ 18న ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన టీజర్ ని రిలీజ్ చేయబోతున్నారు. అందులోనే ప్రాజెక్ట్ టైటిల్ ని కూడా రివీల్ చేయనున్నారు. టీజర్ రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో శేష్ అండ్ శృతి హాసన్ ప్రీలుక్ పోస్టర్స్ ని లాంచ్ చేస్తున్నారు. ఇప్పటికే శేష్ ప్రీలుక్ పోస్టర్ బయటకి రాగా… లేటెస్ట్ గా శృతి హాసన్ కి సంబంధించిన ప్రీలుక్ పోస్టర్ కూడా రిలీజ్ అయ్యింది. ఈ రెండు పోస్టర్స్ లో లీడ్ పెయిర్, ఫేస్ రివీల్ చెయ్యకుండా కర్చీఫ్ లు కట్టుకొని కనిపిస్తున్నారు. మరి ఇది దొంగల కథగా ఏమైనా తెరకెక్కుతుందా అనేది చూడాలి.

Exit mobile version