Adivi Sesh: EXని ఇంట్రడ్యూస్ చేసిన శేష్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘శేష్ జానర్’ అనే జానర్ ని తనకంటూ స్పెషల్ గా క్రియేట్ చేసుకోని సినిమాలు చేస్తున్నాడు అడివి శేష్. థ్రిల్లర్ సినిమాలతో ఎడ్జ్ ఆఫ్ ది సీట్ లో ఆడియన్స్ కూర్చునేలా చేసే అడివి శేష్… ప్రస్తుతం గూఢచారి 2 మూవీతో బిజీగా ఉన్నాడు. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ తో పాటు మరో సినిమా చేస్తున్నాడు అడివి శేష్. ఇటీవలే అనౌన్స్ చేసిన ఈ మూవీని శేష్exశృతి అనే హ్యాష్ ట్యాగ్ తో అడివి శేష్ అనౌన్స్ చేసాడు. శృతి హాసన్ మొదటిసారి శేష్ పక్కన హీరోయిన్ గా నటిస్తోంది. ఇంకా టైటిల్ ఫిక్స్ చేయని ఈ పాన్ ఇండియా మూవీని షానీల్ దేవ్ డైరెక్ట్ చేస్తున్నాడు. శేష్ తో ఎక్కువ రోజులుగా ట్రావెల్ అవుతూ… క్షణం, గూఢాచారి లాంటి సినిమాలకు షానీల్ డీఓపీగా వర్క్ చేసాడు. డైరెక్టర్ గా డెబ్యూ అవుతున్న షానీల్, గతంలో లైలా అనే షార్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేశాడు. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కు ఈ షార్ట్ ఫిల్మ్ అధికారికంగా ఎంపికైంది. ఈ తాజా పాన్ ఇండియా సినిమాకు స్టోరీ, స్క్రీన్ ప్లేను షనీల్, అడివి శేష్ కలిసి చేయనున్నారు.
అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో సుప్రియ యార్లగడ్డ సినిమాను తెరకెక్కిస్తోంది. సునీల్ నారంగ్ సినిమాకు కోప్రొడ్యూసర్ గా ఉన్నాడు. ఈ మూవీకి సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్ త్వరలోనే రానున్నాయి. డిసెంబర్ 18న ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన టీజర్ ని రిలీజ్ చేయబోతున్నారు. అందులోనే ప్రాజెక్ట్ టైటిల్ ని కూడా రివీల్ చేయనున్నారు. టీజర్ రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో శేష్ అండ్ శృతి హాసన్ ప్రీలుక్ పోస్టర్స్ ని లాంచ్ చేస్తున్నారు. ఇప్పటికే శేష్ ప్రీలుక్ పోస్టర్ బయటకి రాగా… లేటెస్ట్ గా శృతి హాసన్ కి సంబంధించిన ప్రీలుక్ పోస్టర్ కూడా రిలీజ్ అయ్యింది. ఈ రెండు పోస్టర్స్ లో లీడ్ పెయిర్, ఫేస్ రివీల్ చెయ్యకుండా కర్చీఫ్ లు కట్టుకొని కనిపిస్తున్నారు. మరి ఇది దొంగల కథగా ఏమైనా తెరకెక్కుతుందా అనేది చూడాలి.
Also Read
- NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
- Koffee With Karan: రెండు దశాబ్దాల సంచలనాలకు ఎండ్ కార్డ్.. ‘కాఫీ విత్ కరణ్’కు గుడ్‌బై చెప్పిన కరణ్!
- YouTuber Nandu : నేను బిగ్ బాస్ కోసం రాలేదు.. కుట్ర జరిగింది, అసలు దోషులు వేరే ఉన్నారు!
- Jr NTR Fan: ఎన్టీఆర్ ను కలిసి ముద్దాడిన ఫ్యాన్
Look at the FURY in her eyes!
Title reveal and First Look on December 18th!l ❤️🔥 #SeshEXShrutiSuper proud and absolutely pumped to be working with @shrutihaasan.
Beautiful heart. Beautiful soul. Looking forward to some magic and chaotic chemistry between us.@Deonidas… pic.twitter.com/Perkfaj3sV
— Adivi Sesh (@AdiviSesh) December 16, 2023
తాజావార్తలు
-
NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
-
Flydubai: హైజాక్ అలర్ట్‌తో ఇజ్రాయెల్‌లో కలకలం.. ‘‘శత్రువును వదలం’’ అంటూ మంత్రి హెచ్చరిక!
-
Ind Vs WI: శివాలెత్తిన వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం.. మూడు సెంచరీలు నమోదు..
-
Chanakya Neeti: జీవితాన్ని గెలవాలంటే ఇది తెలుసుకోండి! చాణక్యుడి సీక్రెట్ రూల్..
-
Meerut Blue Drum Murder: మీరట్ డ్రమ్ మర్డర్ కేసు.. ముస్కాన్-సాహిల్ దోషులుగా నిర్ధారణ.!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!