NTV Telugu Site icon

Ustaad: రాకింగ్ స్టార్ తో సందడి చేయనున్న థ్రిల్లింగ్ స్టార్…

Ustaad

Ustaad

రాకింగ్ స్టార్ మంచు మనోజ్ ఈటీవీ విన్ కోసం స్పెషల్ సెలబ్రిటీ షో చేస్తున్న విషయం తెలిసిందే. ఉస్తాద్… ర్యాంప్ ఆడిద్దాం అంటూ రానా, సిద్ధూ జొన్నలగడ్డ, నాని, విశ్వక్ సేన్, తేజ సజ్జ లాంటి హీరోలతో ఇప్పటికే సందడి చేసిన మంచు మనోజ్ తన హోస్టింగ్ స్కిల్స్ తో షోలో ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు. మంచు మనోజ్ లో ఉండే ఈజ్ ని ఉస్తాద్ షో ప్రేక్షకులని మళ్లీ పరిచయం చేసింది. లేటెస్ట్ గా ఉస్తాద్ షోకి థ్రిల్లింగ్ స్టార్ అడివి శేష్ కూడా గెస్ట్ గా వచ్చేసాడు. జనవరి 18న ప్రీమియర్ కానున్న ఈ ఎపిసోడ్ లో శేష్ అండ్ మంచు మనోజ్ చేయబోయే సందడి ఎలా ఉంటుందో చూడాలని సినీ అభిమానులు ఎదురు చూస్తున్నారు. హీరోల డై హార్డ్ ఫ్యాన్స్ తో సాగే ఈ గేమ్ షోలో అడివి శేష్ డై హార్డ్ ఫ్యాన్ గా ఎవరు ఎంట్రీ ఇస్తారు అనేది చూడాలి.

మేజర్ రిపోర్టింగ్ అంటూ ఈటీవీ విన్ నుంచి శేష్-మనోజ్ ఎపిసోడ్ అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది, ప్రోమో త్వరలో బయటకి రానుంది. ఇక సినిమాల విషయానికి వస్తే అడివి శేష్ ప్రస్తుతం గూఢచారి 2 చేస్తున్నాడు. పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తున్న ఈ సినిమా కోసం మూవీ లవర్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మంచు మనోజ్ కూడా హీరోగా రీఎంట్రీ ఇచ్చే ప్లాన్స్ చేసుకుంటున్నాడు. ఇప్పటికే రెండు సినిమాలు అనౌన్స్ చేసాడు కానీ ఆ ప్రాజెక్ట్స్ విషయంలో అప్డేట్స్ లేవు. మరేదైనా ప్రాజెక్ట్ తో అతి త్వరలో మంచు మనోజ్ సోలో హీరోగా సాలిడ్ కంబ్యాక్ ఇస్తాడని మంచు అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ వెయిటింగ్ కి రాకింగ్ స్టార్ ఎప్పుడు ఎండ్ కార్డ్ వేస్తాడనేది చూడాలి.

Read Also: Suriya: కంగువ సెకండ్ లుక్ రిలీజ్… పీరియాడిక్ కాదు సెమీ పీరియాడిక్

Show comments