NTV Telugu Site icon

Adivi Sesh: అడవి శేష్ సింగిల్ కాదు… బయట పెట్టిన డైరెక్టర్!

Adivi Sesh Interiew

Adivi Sesh Interiew

Adivi Sesh is not single says Director Rahul Ravindran: ప్రస్తుతానికి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరోలలో ఒకరిగా ఉన్నాడు అడవి శేష్. క్షణం అనే సినిమాతో హీరోగా మారి వరుస హిట్లను అందుకుంటూ వస్తున్నాడు. ఆయన ఒకపక్క సినిమా హీరోగా నటిస్తూనే మరోపక్క కొన్ని సినిమాలకు కథలు సైతం అందిస్తూ తన టాలెంట్ బయట పెడుతున్నాడు. అయితే ఆయన తాజాగా ఒక రియాలిటీ షోలో పాల్గొన్నాడు. నిహారిక హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఆహా చెఫ్ మంత్రా అనే కార్యక్రమానికి నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తో కలిసి హాజరయ్యాడు అడవి శేష్. క్రమంలో నిహారిక మాట్లాడుతూ ఎయిట్ తర్వాత వస్తుంది 9, మా శేష్ సింగిల్ కాబట్టి అమ్మాయిలు వేసుకోవచ్చు లైన్ అంటూ ఒక పంచ్ డైలాగ్ పేల్చింది.

Snigdha: నన్ను రేప్ చేయబోయారు.. నాన్న మీద కూడా అనుమానమే?

దానికి రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ అడవి శేషు సింగిల్ అని ఎవరు చెప్పారు అంటూ ఒక్కసారిగా షాక్ ఇచ్చాడు అదేంటి అతనికి లవ్ స్టోరీ ఏమైనా ఉందా అని అందరూ ఆలోచించే లోపే అతను సింగిల్ కాదు మల్టిపుల్ అంటూ కౌంటర్ వేశాడు. ఇక మూడు నిమిషాల నిడివి ఉన్న ఈ ప్రోమో ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఈ కార్యక్రమంలో ఇద్దరు గెస్టులు హాజరవుతారు. ఇద్దరూ చెరు ఒక వంటకాన్ని రెడీ చేస్తూనే షో కోసం ప్రేక్షకులకు కంటెంట్ ఇస్తూ ఉంటారు. ఇక ఈ క్రమంలోనే అనేక విషయాలు కూడా వెలుగులోకి వస్తూ ఉంటాయి.