Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Movie News Adivi Sesh Decoyit Mrunal Thakur Interview April 10 Release

Mrunal Thakur : డెకాయిట్‌లో రిస్కీ యాక్షన్ స్టంట్స్ చేశా!

Published Date :April 6, 2026 , 8:39 am
By Bhargav Chaganti
Mrunal Thakur : డెకాయిట్‌లో రిస్కీ యాక్షన్ స్టంట్స్ చేశా!
  • Follow Us :
  • google news
  • dailyhunt

బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్లతో అలరిస్తున్న అడివి శేష్ పాన్-ఇండియా యాక్షన్-రొమాంటిక్ థ్రిల్లర్ ‘డెకాయిట్‌’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంతో షానియల్ డియో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శేష్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించారు. అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఈ చిత్రాన్ని సుప్రియ యార్లగడ్డ నిర్మించగా, సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాటీజర్ ట్రైలర్ పాటలు సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. డెకాయిట్‌ ఏప్రిల్ 10న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ మృణాల్ ఠాకూర్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

డెకాయిట్ లో ఇంత కాంప్లెక్స్ క్యారెక్టర్ చేయడం ఎలా అనిపించింది?
-ఇందులో చేసిన సరస్వతి క్యారెక్టర్ చాలా డిఫికల్ట్. అయితే మేకర్స్ ఆ క్యారెక్టర్‌ను యాక్టర్‌కు సులభంగా అర్థమయ్యేలా తీర్చిదిద్దారు. ఒక యాక్టర్‌కు ఛాలెంజ్ ఉన్న క్యారెక్టర్ చేయడం ఎప్పుడూ ఆనందాన్ని ఇస్తుంది. సరస్వతి క్యారెక్టర్ చేయడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఈ క్యారెక్టర్‌ను చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను. నా కెరీర్‌లో ఇది చాలా డిఫరెంట్ రోల్. ఇప్పటివరకు నేను చేయని కొత్త జానర్ ఇది. తప్పకుండా ఈ క్యారెక్టర్ అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను. ఈ సినిమాలో కొన్ని స్టంట్స్ కూడా చేశాను. చేజింగ్ సన్నివేశాలు, డ్రైవింగ్ సీన్స్ చాలా ఎంజాయ్ చేశాను. సీతారామం, హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ చిత్రాలతో తెలుగు ఆడియన్స్ నన్ను ఒక తెలుగు అమ్మాయి లాగా అంగీకరించారు. వారి ప్రేమాభిమానాలు ఎప్పటికీ మర్చిపోలేను. మంచి పాత్రలు చేస్తాననే నమ్మకం వారికి ఉంది. సరస్వతి పాత్ర కూడా అందర్నీ ఆకట్టుకుంటుంది. నాకు ఎప్పుడూ ఎక్స్‌పెరిమెంట్ చేయాలని ఉంటుంది. అలాగే నాకు నేనే సర్ప్రైజ్ అవ్వడం ఇష్టం. అలాంటి అవకాశం ఇచ్చిన సినిమా ఇది.
నాకు కొత్త ఎమోషన్స్ ఉన్న సినిమాలు చేయాలనిపిస్తుంది. ఇప్పటివరకు చేయని క్యారెక్టర్లు చేయాలనే తపన ఉంటుంది. డెకాయిట్ కూడా అలాంటి కొత్త జానర్ సినిమా.

కథ విన్నప్పుడు మీ రియాక్షన్ ఏమిటి?
-కథ విన్నప్పుడు సరస్వతి, హరి ఎందుకు డెకాయిట్స్‌గా మారారో అనేది నాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది. అది మీరు బిగ్ స్క్రీన్ మీద చూడాలి. ఇది ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ. ఈ సినిమాలో “రూబారు” పాట ఇప్పటికే పెద్ద హిట్ అయింది. ఇంకా కొన్ని సాంగ్స్ ఉన్నాయి, అవన్నీ ఆడియన్స్‌ను సర్ప్రైజ్ చేస్తాయి. పాటలన్నీ మైండ్ బ్లోయింగ్‌గా ఉంటాయి.

సీతారామంలో మీ క్యారెక్టర్‌కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు డెకాయిట్ సినిమా ఎలాంటి అనుభవం ఇస్తుంది?
-ఈ సినిమాని శేష్ కోసం థియేటర్‌కు వచ్చి చూడాలని కోరుకుంటున్నాను. ఇందులో అడివి శేష్ చాలా అద్భుతంగా నటించారు. ఇప్పటివరకు చేయని ఒక కొత్త క్యారెక్టర్ చేశారు. ఇది ఆయన బెస్ట్ ఫిల్మ్స్‌లో ఒకటిగా ఉంటుంది. శేష్, ప్రకాష్ రాజ్ తో కలిసి పనిచేయడం మంచి అనుభవం.

సీత క్యారెక్టర్‌కు సరస్వతి క్యారెక్టర్‌కు ఎలాంటి పోలికలు ఉన్నాయి?
-ఈ రెండు పూర్తిగా భిన్నమైన పాత్రలు. సీత లాంటి పాత్రలో నన్ను ఇప్పటికే ఆడియన్స్ చూశారు. నన్ను కొత్తగా చూడాలనుకునే వారికి ఈ సినిమా ఖచ్చితంగా సర్ప్రైజ్ ఇస్తుంది.

హిందీ తెలుగులో షూట్ చేయడం గురించి?
-ఈ సినిమా రెండు భాషల్లో షూట్ చేశాం. సీతారామం, హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ అన్నీ స్ట్రైట్ తెలుగు సినిమాలు. కానీ ఇది రెండు భాషల్లో చేయడం నాకు మరింత ఛాలెంజింగ్‌గా అనిపించింది.

అనురాగ్ కశ్యప్ తో వర్క్ చేయడం ఎలా అనిపించింది?
-అనురాగ్ అద్భుతమైన డైరెక్టర్. యాక్టర్‌గా కూడా చాలా వెర్సటైల్. ఈ సినిమాలో ఆయన పెర్ఫార్మెన్స్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. మేమిద్దరం హిందీ నుంచి వచ్చాం. కలిసి తెలుగు డైలాగ్స్ నేర్చుకోవడం మంచి అనుభవం.

శేష్ తో వర్క్ చేయడం ఎలా అనిపించింది?
-శేష్ స్వయంకృషితో ఎదిగిన స్టార్. అలాంటి సెల్ఫ్‌మేడ్ స్టార్‌తో పనిచేయడం గొప్ప అనుభవం. ఆయన సినిమాకు సంబంధించిన ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. రైటింగ్, డైరెక్షన్.. అన్నిట్లోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. చాలా హంబుల్‌గా ఉంటారు.

అన్నపూర్ణ స్టూడియోస్ సుప్రియతో సినిమా చేయడం ఎలా అనిపించింది?
-సుప్రియ వెరీ నైస్ ప్రొడ్యూసర్. ఒకసారి నేను షూటింగ్ కోసం ముంబై నుంచి హైదరాబాద్ రావాలి. అప్పుడు నాకు జ్వరం. నా ఆరోగ్యం గురించి తెలుసుకుని షూటింగ్‌ను రెండు రోజులు హోల్డ్ చేశారు. నటీనటుల ఆరోగ్యాన్ని ఇంతగా చూసుకునే ప్రొడ్యూసర్‌ను నేను చూడలేదు.

ట్రైలర్‌లో ఒక చేజింగ్ సీక్వెన్స్ ఉంది. అందులో మీరు డ్రైవింగ్ చేశారు… ఆ అనుభవం?
-నాకు డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. మా ఇంట్లో కార్ డ్రైవ్ చేసిన మొదటి అమ్మాయి నేనే. యాక్షన్ సినిమాలు నాకు చాలా ఇష్టం. ఈ సినిమాలో అలాంటి యాక్షన్ చేసే అవకాశం దొరికింది.

షూటింగ్ ఎక్స్ పీరియన్స్?
-ఈ సినిమాకు వర్క్‌షాప్ కూడా చేశాం. కానీ ఆ విషయాలు ఇప్పుడు చెప్పలేను. ఎక్కువగా అవుట్‌డోర్‌లో షూట్ చేశాం. ముఖ్యంగా రోడ్లపై డ్రైవింగ్ సీక్వెన్స్‌లు చాలా థ్రిల్లింగ్‌గా ఉన్నాయి. ఒక అంబులెన్స్ డ్రైవ్ చేయాల్సి వచ్చింది. దానికి హ్యాండ్ బ్రేక్ ఉండదు. చాలా రిస్కీ సన్నివేశాలు కూడా చేశాం.

డైరెక్టర్ శానిల్ గురించి?
-శానిల్ ఫాంటాస్టిక్ డైరెక్టర్. ఈ సినిమా విజువల్‌గా అద్భుతంగా ఉంటుంది. డైరెక్టర్, ఎడిటర్, కెమెరామెన్ ముగ్గురి టీమ్‌వర్క్ చాలా గొప్పగా ఉంది. విజువల్స్ హాలీవుడ్ స్టైల్‌లో ఉంటాయి. అన్ని విభాగాల్లో అద్భుతమైన పని చేశారు. డెకాయిట్ మ్యూజిక్ కూడా నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. టీజర్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. “కన్నేపెట్టరో” పాట నాకు చాలా ఇష్టం. ‘డెకాయిట్‌’ ఖచ్చితంగా అందరినీ సర్ప్రైజ్ చేస్తుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Adivi Sesh Decoyit
  • Anurag Kashyap role
  • Decoyit movie
  • Decoyit release date
  • Mrunal Thakur interview

తాజావార్తలు

  • Mrunal Thakur : డెకాయిట్‌లో రిస్కీ యాక్షన్ స్టంట్స్ చేశా!

  • Dhurandhar 2: ధురంధర్-2 సినిమా వీక్షించిన పాక్ మాజీ ప్రధాని..రియాక్షన్ ఇదే!

  • RCB 5 Records: డివిలియర్స్ రికార్డును సమం చేసిన టిమ్ డేవిడ్.. 250 పరుగులతో 5 రికార్డులు నెలకొల్పిన ఆర్‌సిబి

  • Tirumala Hundi Issue: శ్రీవారికి చెల్లని నోట్ల పంచాయతీ

  • Sharwanand: ‘బైకర్’ భారీ సక్సెస్‌తో.. వెండితెరకు శర్వానంద్ శిరస్సు వంచి నమస్కారం.. !

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions