Dacoit : నెంబర్ 1 ట్రెండింగ్‌లో దూసుకెళ్తున్న అడివి శేష్ ‘డెకాయిట్’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అడివి శేష్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘డెకాయిట్’ ఓటీటీలో సెన్సేషన్ సృష్టిస్తోంది. ఈ చిత్రం మే 8, 2026న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన వెంటనే ఇండియా వైడ్ నెంబర్ 1 స్థానాన్ని దక్కించుకుంది. ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ స్పేస్‌లో కూడా భారీ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రానికి సోషల్ మీడియాలో అద్భుతమైన స్పందన లభిస్తోంది.
మంచి కంటెంట్‌ను ఎంపిక చేసుకోవడంలో అడివి శేష్‌కు ఉన్న విజన్ ని మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంది. విభిన్న కథలు, బలమైన కథనాలతో ఆయనకు ఉన్న క్రేజ్ ‘డెకాయిట్’తో మరింత బలపడింది. ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటించగా, ఇద్దరి నటన సినిమాకి ప్రధాన బలంగా నిలిచింది. అనురాగ్ కశ్యప్, ప్రకాశ్ రాజ్, సునీల్, అతుల్ కులకర్ణి, జైన్ మేరీ ఖాన్, కామాక్షి భాస్కర్ల వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించారు.
Also Read
- Varanasi Update: 'వారణాసి'లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
- world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. 'భోగి' టీజర్ రిలీజ్
- Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
- Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
దర్శకుడిగా పరిచయమైన షనీల్ డియో ఈ చిత్రాన్ని స్టైలిష్‌గా, గ్రిప్పింగ్‌గా తెరకెక్కించారు. సినిమాటోగ్రాఫర్ ధనుష్ భాస్కర్ విజువల్స్, కొదాటి పవన్ కళ్యాణ్ ఎడిటింగ్, భీమ్స్ సిసిరోలియో సంగీతం సినిమాకి మరింత బలం చేకూర్చాయి. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై సుప్రియా యార్లగడ్డ, సునీల్ నారంగ్ నిర్మించిన ఈ చిత్రంలో ఉన్న హై ప్రొడక్షన్ వాల్యూస్ డిజిటల్ స్క్రీన్‌పైనా స్పష్టంగా కనిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!