టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ ఇంకా చాలామందే ఉన్నారు. గత రెండేళ్ల కాలంలో ఎంతోమంది స్టార్లు పెళ్లి పీటలు ఎక్కారు. ఇక నిన్నటికి నిన్న యంగ్ హీరో ఆది పినిశెట్టి కూడా వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. దీంతో టాలీవుడ్ బ్యాచిలర్స్ ను పెళ్లెప్పుడు అని అడగడం కామన్ అయిపోయింది. వారు కూడా ఇప్పుడే పెళ్లి ఏంటి అనో, సీనియర్స్ వున్నారు కదండీ వాళ్ల తరువాతే నేను అనేస్తున్నారు. ఇక యంగ్ హీరో అడివి శేష్ అయితే ఒక అడుగు ముందుకేసి.. నా ఫఫ్రెండ్స్ పెళ్లి అయ్యాక అని చెప్పుకొచ్చేస్తున్నాడు. ప్రస్తుతం శేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మేజర్’. పాన్ ఇండియా మూవీగా జూన్ 3 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ నేపథ్యంలోనే ప్రమోషన్ కార్యక్రమాలను షురూ చేసిన మేకర్స్.
ఇక ఈ ప్రమోషన్స్ లో అడివి శేష్ పెళ్లి హాట్ టాపిక్ గా మారింది. శేష్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు..? అన్న ప్రశ్నకు శేష్ మాట్లాడుతూ ” చిత్ర పరిశ్రమలో ఇంకా మ్యారేజ్ కావాల్సిన వాళ్లు చాలా మంది వున్నారు. వాళ్ల పెళ్లిళ్లు అయ్యాక నా పెళ్లి గురించి ఆలోచిద్దాం. నా స్నేహితులు ప్రభాస్, అనుష్క పెళ్లి కాలేదు.. వారి పెళ్లి తర్వాత నా పెళ్లి ఉంటుంది” అంటూ చెప్పి అందరికి షాక్ ఇచ్చాడు.పెళ్లెప్పుడు అని అడిగితె వారి పెళ్లితో ముడి పెట్టడం ఎందుకు అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇక శేష్ మాటలతో ప్రభాస్- అనుష్క పెళ్లి మ్యాటర్ మరోసారి తెరపైకి వచ్చింది. వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు గుప్పుమన్న విషయం విదితమే. అయితే తాము బెస్ట్ ఫ్రెండ్స్ అని, తమ మధ్య ఎలాంటి రిలేషన్ లేదని ప్రభాస్- అనుష్క ఖరాకండిగా చెప్పడంతో ఈ పుకార్లకు చెక్ పడింది. ఇప్పుడు మరోసారి శేష్ వ్యాఖ్యలతో ప్రభాస్ పెళ్లి వార్త కూడా హాట్ టాపిక్ గా మారింది.