Chicchu Buddi : అడివి శేష్ ‘డెకాయిట్’ ‘చిచ్చుబుడ్డి’లో భోజ్ పురి స్టార్ హీరో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాన్ ఇండియా హిట్లతో జోరు మీదున్న యంగ్ హీరో అడివి శేష్, ఇప్పుడు తన రూట్ మార్చారు, ఇప్పటివరకు క్లాస్ అండ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్లతో మెప్పించిన శేష్, మొదటిసారి ఊర మాస్ అవతారంలోకి మారిపోయారు. ఆయన నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ రొమాంటిక్ థ్రిల్లర్ ‘డెకాయిట్’ నుంచి సెకండ్ సింగిల్ ‘చిచ్చుబుడ్డి’ సాంగ్ నేడు విడుదలై సోషల్ మీడియాను షేక్ చేస్తోంది, సాధారణంగా అడివి శేష్ సినిమాల్లో డ్యాన్స్ కంటే మైండ్ గేమ్స్ ఎక్కువగా ఉంటాయి. కానీ, ‘చిచ్చుబుడ్డి’ పాటతో ఆయన తనలోని అసలైన డ్యాన్సర్‌ని బయటకు తీశారు. హై-ఎనర్జీతో సాగే ఈ ఫోక్ బీట్ సాంగ్‌లో శేష్ వేసిన మాస్ స్టెప్పులు ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తున్నాయి. ఒక రగ్గడ్ లుక్‌లో కనిపిస్తూనే, అదిరిపోయే గ్రేస్‌తో శేష్ అదరగొట్టారు.
Also Read:Lenin: పెద్ది కోసం వెనక్కి తగ్గిన అయ్యగారు!
Also Read
- Nayanthara: బికినీలో నయనతార.. కానీ ఫాన్స్‌కు నిరాశే!
- RaviTeja - VivekAthreya : రవితేజ 'తులాభారం'లో తూగబోయే నటీనటులు వీరేనట
- The Paradise Collections: @200 కోట్లు లోడింగ్.. నెగిటివ్ టాక్‌ను తిప్పికొట్టి 'ది పారడైస్' బాక్సాఫీస్ జోరు మాములుగా లేదుగా..!
- EPIC : ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్న 'ఎపిక్'.. ఎప్పుడు ఎక్కడ చూడాలంటే?
ఈ పాటకు భీమ్స్ సెసిరోలియో అందించిన మాస్ బీట్స్ సాంగ్‌ను ఎక్కడికో తీసుకెళ్లాయి, భాస్కరభట్ల తనదైన శైలిలో అందించిన సాహిత్యం వినగానే కాలు కదిపేలా ఉంది. ఇక గాయనీగాయకులు రామ్ మిరియాల, జోనితా గాంధీ తమ గొంతులతో పాటలో ఎనర్జీని నింపారు. ప్రత్యేకంగా భోజ్‌పురి స్టార్ పవన్ సింగ్ ఈ పాటలో కనిపించి మాస్ వైబ్‌ను మరింత పెంచారు. జోనితా గాంధీ కేవలం పాడటమే కాకుండా, తెరపై గ్లామరస్ డ్యాన్స్‌తో మెరిసిపోవడం విశేషం. ఒక పెద్ద సెట్‌లో, భారీ జనసందోహం మధ్య ఈ పాటను అత్యంత రిచ్‌గా చిత్రీకరించారు. ప్రతి ఫ్రేమ్ ఒక వేడుకలా కనిపిస్తోంది. షానియల్ డియో దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో శేష్ సరసన మృణాల్ ఠాకూర్ నటిస్తోంది, అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 10న థియేటర్లలోకి రానుంది.
తాజావార్తలు
-
Mahindra BE 07, Thar: మహీంద్రా Electric SUVలు టెస్టింగ్‌లో.. BE 07, Thar EVలో 500Km రేంజ్, అదిరిపోయే ఫీచర్లు!
-
vivo X Fold6: 200MP కెమెరా.. 6900mAh బ్యాటరీ.. vivo కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది! ఫీచర్లు అదిరిపోయాయ్
-
Nayanthara: బికినీలో నయనతార.. కానీ ఫాన్స్‌కు నిరాశే!
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
-
RaviTeja – VivekAthreya : రవితేజ ‘తులాభారం’లో తూగబోయే నటీనటులు వీరేనట
ట్రెండింగ్
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!