Adivi Sesh Another Pan India Movie Under Annapurna Studios Banner: తనకంటూ స్పెషల్ జానర్‌ని క్రియేట్ చేసుకోని, ఆడియన్స్‌ని అలరిస్తున్న హీరో ‘అడివి శేష్’. లో బడ్జట్ సినిమాల్లో హై టెక్నికల్ స్టాండర్డ్స్‌ని ప్రెజెంట్ చేస్తూ.. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతున్న అడివి శేష్ ప్రస్తుతం ‘హిట్ 2’ మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. ‘హిట్’ ఫ్రాంచైజ్‌లో భాగంగా తెరకెక్కిన ‘హిట్ 2’ మూవీ డిసెంబర్ 2న విడుదల కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా అడవి శేష్ తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ విషయాలని చెప్పుకొచ్చాడు. ఇటివలే ‘మేజర్’ సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టిన శేష్, మరోసారి పెద్ద బ్యానర్‌లో పాన్ ఇండియా సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. మేజర్ సినిమాని మహేశ్ బాబు బ్యానర్‌లో చేసిన శేష్, తన నెక్స్ట్ పాన్ ఇండియా సినిమాని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌లో చేయనున్నాడు.
అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ అక్కినేని ఫ్యామిలీకి చెందినది. ఇంట్లో ఇద్దరు యంగ్ హీరోలు ఉన్నారు, అందులో ఒకరు ఇప్పటికే పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. ఇలాంటి సమయంలో కింగ్ నాగ్, అడవి శేష్‌తో పాన్ ఇండియా సినిమా ప్రొడ్యూస్ చేయడానికి కమిట్ అవ్వడం విశేషం. మరి శేష్ అఫీషియల్‌గా చెప్పేసిన ఈ ప్రాజెక్ట్‌కి దర్శకుడు ఎవరు? ఎలాంటి కథతో ఈ పాన్ ఇండియా సినిమా రాబోతోంది? ‘గూఢచారి 2’ కంప్లీట్ అయ్యాక అన్నపూర్ణ స్టూడియోస్, అడవి శేష్ సినిమా మొదలవుతుందా? లేక గూఢచారి 2 కన్నా ముందే ఈ సినిమా స్టార్ట్ అవుతుందా లాంటి ప్రశ్నలకి సమాధానం తెలియాలి అంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.
