Aditi Bhavaraju : సింగర్ అదితి భావరాజుకు ఎంత క్రేజ్ ఉందో తెలిసిందే. ఇప్పటికే సింగర్ గా మంచి పేరు సంపాదించుకుంది. చాలా పెద్ద సినిమాల్లో కూడా పాటలు పాడింది. ఆమె తాజాగా హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది. ఇన్ని రోజులు సింగర్ గా అలరించిన అదితి.. ఇప్పుడు హీరోయిన్ గా అలరించేందుకు రెడీ అవుతోంది. కలర్ ఫొటో, బెదురు లంక 2012 లాంటి హిట్ మూవీలు నిర్మించిన రవీంద్ర బెనర్జీ ముప్పనేని.. ఇప్పుడు దండోరా సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీని లౌక్య ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ మీద రూపొందిస్తున్నారు.
Read Also : Lal Salam : ఎట్టకేలకు ఓటీటీలోకి రజినీకాంత్ ‘లాల్ సలాం’..
మురళీకాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను పూర్తిగా తెలంగాణ గ్రామీణ నేపథ్యంలోనే తీస్తున్నారు. పల్లెతనం ఉట్టిపడేలా తీస్తున్న ఈ మూవీలో సామాజిక రుగ్మతలను చూపించబోతున్నారు. ప్రస్తుత సమాజంలో జరుగుతున్న అనేక విషయాలను ఇందులో రూపొందించారు. ఇందులో శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, మనికా చిక్కాల, మౌనికా రెడ్డి, బిందు మాధవి, రాధ్య తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీలో హీరోయిన్ గా జాయిన్ అవుతోంది అదితి. సింగర్ గా అదరగొడుతున్న ఆమె.. హీరోయిన్ గా కూడా రాణిస్తుందని ఆమె ఫ్యాన్స్ అంటున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే కొన్ని కీలక సన్నివేశాలు పూర్తి చేశారు. రీసెంట్ గా వచ్చిన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. రాబోయే రోజుల్లో మూవీకి సంబంధించిన వరుస అప్డేట్లు ఇస్తామని మూవీటీమ్ చెబుతోంది. ఈ సినిమాకు మార్క్ కె.రాబిన్ సంగీతాన్ని అందిస్తున్నారు.
Read Also : Sree Leela : శ్రీలీల ఎంగేజ్ మెంట్..? ఫొటోలు వైరల్..!
