NTV Telugu Site icon

Adipurush : మాట మార్చిన ఆదిపురుష్ రైటర్.. అప్పుడలా, ఇప్పుడిలా!

Adipurush Writer U Turn

Adipurush Writer U Turn

Adipurush Writer Manoj Muntashir Shukla U turn Words: ఎట్టకేలకు చాలా కాలం నుంచి వాయిదా పడుతూ వస్తున్న ప్రభాస్ ఆది పురుష్ సినిమా జూన్ 16వ తేదీన అంటే శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓం రౌత్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాని భారీ బడ్జెట్ తో టి సిరిస్ సంస్థ నిర్మించింది. ప్రభాస్ రాముడిగా కృతి సనన్ సీతగా నటించిన ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడు పాత్రలో నటించారు. అయితే సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా రామాయణం కంటే చాలా భిన్నంగా ఉందనే వాదనలు తెర మీదకి వచ్చాయి. ముఖ్యంగా పాత్రలకు పెట్టిన పేర్లు కొన్ని కొన్ని సంఘటనలు వాల్మీకి రామాయణంలో జరిగినట్టు లేవని చర్చ జరుగుతోంది.
Adipurush: రెండో రోజు నాన్ ఆర్ఆర్ఆర్ రికార్డులు బద్దలు కొట్టిన ఆదిపురుష్!
అయితే ఈ విషయం మీద తాజాగా ఒక మీడియా సంస్థతో మాట్లాడిన ఈ సినిమా రైటర్ మనోజ్ ముంతషీర్ శుక్లా మేము రామాయణం చేయలేదని చెప్పుకొచ్చారు, తాము రామాయణ కథ నుంచి పెద్ద ఎత్తున ఇన్స్పైర్ అయ్యామని మీరు పరిశీలిస్తే ఆది పురుష్ అనే పేరు కూడా భిన్నంగానే ఉంటుందని చెప్పుకొచ్చారు. అయితే నిజానికి ఇదే రైటర్ సినిమా రిలీజ్ అవ్వడానికి ముందు వేరే విధంగా మాట్లాడారు. సుమారు 8 నెలల క్రితం ఆయన మాట్లాడుతూ మేము రామాయణాన్ని మోడరన్ గా తరికెక్కిస్తున్నామా? ఒరిజినల్ రామాయణం నుంచి ప్రేక్షకులు డివైడ్ అయ్యే విధంగా ఆదిపురుష్ సినిమా చేస్తున్నామా? అంటే కచ్చితంగా అలా చేయడం లేదని చెప్పుకొచ్చారు. రామాయణం గురించి ముందు నుంచి ప్రజలు ఏం చదివారో? ఏం విన్నారో? ఏం చూశారో అవే విషయాలని ఆది పురుష్ సినిమాలో కూడా చూపిస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు.
Rashmika Mandanna: దారుణంగా మోసపోయిన రష్మిక.. క్షణాల్లో సంచలన నిర్ణయం!
అయితే పాత్రల పేర్లు సహా కొన్ని సంఘటనలు కూడా వేరుగా ఉండటంతో ఇప్పుడు ఆయన మాట మార్చారు అనే వాదన వినిపిస్తోంది. ఇక హనుమంతుడి చేత పంచ్ డైలాగులు పలికించిన క్రమంలో ఆ విషయం మీద కూడా చర్చ జరుగుతున్న నేపథ్యంలో దాని మీద కూడా ఆయన స్పందించినట్లు తెలుస్తోంది. తన వైపు నుంచి ఎలాంటి తప్పు లేదని ఎంతో ఆలోచించే హనుమంతుడి డైలాగ్స్ రాశాను అని చెప్పకువచ్చారు. ఇక సినిమాలో ఎన్నో పాత్రలు ఉన్నాయి కానీ అందరూ ఒకేలా మాట్లాడారు కదా, పాత్రల మధ్య వైవిధ్యం చూపించడం కోసమే హనుమంతుడి భాష సింపుల్ గా ఉండడం కోసం అలా రాసుకున్నానని చెప్పుకొచ్చారు. తాను పల్లెటూరు నుంచి వచ్చిన వాడినని చెబుతూ తన బామ్మలు చెప్పిన విషయాన్ని అంతే సింపుల్ గా ప్రేక్షకులు చెప్పడానికి ప్రయత్నించానని ఈ డైలాగ్స్ ఏమీ కొత్తగా సృష్టించినవి కాదని ఆయన కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఏదేమైనా ఈ విషయంలో మాత్రం ఆది పురుష్ టీం గట్టిగా ట్రోల్స్ ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తోంది. చూడాలి మరి భవిష్యత్తులో ఏం జరగబోతోంది అనేది.

Show comments