NTV Telugu Site icon

Adipurush: టీవీలో దుమ్మురేపిన ఆదిపురుష్

Adhipurush

Adhipurush

Adipurush records impressive TRP ratings in Star MAA: ఆదిపురుష్ సినిమా ఇండియన్ బిగ్ స్క్రీన్ మీద సత్తా చాటలేకపోయినా టిఆర్‌పి రేటింగ్స్‌తో మాత్రం దుమ్మురేపి ఒక రేంజ్ లో ఆకట్టుకుంది. ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ రాముడిగా నటించిన మైథలాజికల్ డ్రామా జూన్ 16న థియేటర్లలో విడుదలై మిశ్రమ స్పందనను అందుకుంది. అయినప్పటికీ, ఆదిపురుష్ సినిమా టీవీ ప్రీమియర్స్ లో ఆకట్టుకునే TRP రేటింగ్‌లను రికార్డ్ చేసింది. స్టార్ మాలో ఆదిపురుష్ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ అక్టోబర్ 29, 2023న సాయంత్రం 05:30 గంటలకు ప్రదర్శించబడింది. పట్టణ ప్రాంతాల్లో 9.47 TRP మరియు U+R మార్కెట్‌లలో 8.41 TRP వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ ఫలితాన్ని పరిశీలిస్తే , TRP 9.47 (8.41 U+R) మంచి రేటింగ్ అనే చెప్పాలి.

Nani: కూతురు కావాలంటున్న నాని

ఎందుకంటే ప్రస్తుతం జరుగుతున్న ODI క్రికెట్ ప్రపంచ కప్ కూడా సినిమాల రేటింగ్‌లను ప్రభావితం చేస్తోంది. సూపర్ హిట్స్ అయిన సినిమాలు 5 – 6 మరియు అంతకంటే తక్కువ స్థాయిలో టీఆర్ఫీ సాధించగా ఆదిపురుష్ మాత్రం ఆకట్టుకునే TRP రేటింగ్‌లను సాధించింది. ఆదిపురుష్‌ సినిమాను భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్ ఆలాగే రెట్రోఫిల్స్‌కు చెందిన రాజేష్ నాయర్ భారీ స్థాయిలో నిర్మించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ‘ఆదిపురుష్’ చిత్రంలో రాముడిగా ప్రభాస్, జానకిగా కృతి సనన్, రావణ్‌గా సైఫ్ అలీ ఖాన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్ మరియు హనుమంతుడిగా దేవదత్తా నాగే నటించారు. అజయ్ – అతుల్, సచేత్ పరంపర ఈ చిత్రానికి సంగీత దర్శకులుగా వ్యవహరించారు.

Show comments