Site icon NTV Telugu

AdiPurush: ఆదిపురుష్ డైరెక్టర్ కు లగ్జరీ కారు గిఫ్ట్ ఇచ్చిన నిర్మాత.. ధర తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే

Om Rauth

Om Rauth

AdiPurush: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, కృతి సనన్ జంటగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఆదిపురుష్. రామాయణం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించగా, కృతి సనన్ సీతగా కనిపించనుంది. ఇక ఇటీవలే ఈ సినిమా టీజర్ రిలీజ్ అవ్వడం, వివాదాలు ఆదిపురుష్ ను వెంటాడం వెంటవెంటనే జరిగిపోయాయి. యానిమేషన్ సినిమా, బొమ్మల సినిమా తీసి పాన్ ఇండియా ఫిల్మ్ అంటున్నారని కొందరు.. రామాయణాన్నితప్పుగా చూపించారని కొందరు కేసులు పెట్టారు.. ట్రోల్స్ చేశారు. సినిమాను బ్యాన్ చేయాలనీ కూడా సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. ఇక అభిమానులను నిరాశపర్చాలని ఉద్దేశ్యంతో తాము ఆ పని చేయలేదని, అందుకే సినిమాను 3డి లో రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు.ఈ ట్రోలింగ్ ను పక్కన పెడితే డైరెక్టర్ ఓం రౌత్ కు నిర్మాత కాస్ట్లీ కారు గిఫ్ట్ గా ఇవ్వడం సంచలనం సృష్టిస్తోంది.

కోటి కాదు రెండు కోట్లు కాదు ఏకంగా రూ. 4 కోట్లు విలువ చేసే ఫెరారీ కారును నిర్మాత గిఫ్ట్ గా ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. అయితే ఇది ఇప్పుడు ఆర్డర్ పెట్టింది కూడా కాదట.. టీజర్ కు ముందే ఈ కారును బుక్ చేశాడట నిర్మాత. అంటే టీజర్ తరువాత ప్రేక్షకుల స్పందన ఈ రేంజ్ లో ఉంటుందని పాపం నిర్మాత ఉహించకపోవచ్చు. తేజ కు మంచి స్పందన వస్తే అప్పుడు మెచ్చుకొని కారును బహుమతిగా ఇవ్వాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అయితే వారు అనుకున్నట్లు రిజల్ట్ రాకపోయేసరికి కొద్దిగా గ్యాప్ ఇచ్చి ఇప్పుడు ఆ కారును బహుకరించినట్లు తెలుస్తోంది. మరో రకంగా చెప్పాలంటే ట్రోల్స్ ద్వారా అయినా ఆదిపురుష్ అందరికి రీచ్ అయ్యింది. అది కూడా ఒక విజయమే.. దానికోసమేనా డైరెక్టర్ కు కారు గిఫ్ట్ ఇవొచ్చు అని అభిమానులు చెప్పుకొస్తున్నారు.

Exit mobile version