Site icon NTV Telugu

Adipurush : హనుమంతుని వివాదస్పద డైలాగ్ మార్చిన మేకర్స్…

Whatsapp Image 2023 06 21 At 5.54.03 Pm

Whatsapp Image 2023 06 21 At 5.54.03 Pm

ఆదిపురుష్…సినిమా విడుదలయిన మెదటి రోజు భారీగా కలెక్షన్స్ వచ్చాయి. అదే విధంగా విమర్శలు కూడా వచ్చాయి.రామాయణ ఇతిహాసం ఆధారంగా ఓంరౌత్ తెరకెక్కించిన ఆదిపురుష్ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది .ఇందులో రాఘవుడి గా ప్రభాస్, జానకిగా కృతి సనన్ అలాగే రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటించిన విషయం తెలిసిందే.ఈ సినిమాకు వీఎఫ్ఎక్స్ గురించి ముందుగా ట్రోల్స్ వచ్చాయి. దీంతో గ్రాఫిక్స్ లో మార్పులు చేస్తామని విడుదల వాయిదా వేసింది చిత్రయూనిట్. ఇక వీఎఫ్ఎక్స్ మార్పులు చేసి ఇటీవలే జూన్ 16న ఎంతో గ్రాండ్ గా ప్రేక్షకులు ముందుకు తీసుకువచ్చారు. ఈ సినిమాలో రామాయణాన్ని అపహాస్యం చేశారని అలాగే డైలాగ్స్ మరియు కాస్ట్యూమ్స్ పై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి.ఈ సినిమా లో హనుమంతుడు మాస్ డైలాగ్ చెప్పడం ఏంటి అని మండి పడుతున్నారు.. దీంతో రైటర్ వివరణ ఇచ్చిన్నప్పటికీ కూడా విమర్శలు ఆగలేదు.. దీంతో డైలాగ్స్ మార్చి కొత్తగా యాడ్ చేస్తామని వివరణ కూడా ఇచ్చారు.

ఇక ఇప్పుడు ఆ కొత్త డైలాగ్ ను యాడ్ చేశారు మేకర్స్. హనుమంతుడు చెప్పే డైలాగ్ లో నీ బాబుది అనే పదాన్ని తొలగించి లంక అనే పదాన్ని జత చేసింది చిత్రయూనిట్. ఇక ఇప్పుడు కొత్త డైలాగ్ విషయంలో అసలు డైలాగ్ కాకుండా.. కేవలం పదాన్ని మాత్రం లంక పేరుతో మార్చారు. అలా మారిస్తే అర్థం మారిపోదు కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ఈ చిత్రంలో హనుమ పాత్రను బాలీవుడ్ నటుడు అయిన దేవదత్తా నాగే పోషించారు.ఈ సినిమాకు మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లు రాబట్టింది. కానీ ఈ చిత్రం కు రోజూ రోజుకీ కలెక్షన్స్ భారీగా తగ్గిపోతున్నాయి. వరుసగా ఈ ఐదు రోజుల్లో రూ.350కు పైగా వసూళ్లు రాబట్టిన్నట్లు సమాచారం.ఈ సినిమా పై విమర్శలు రాకపోయినట్లయితే భారీగా కలెక్షన్స్ వచ్చేవి అని ట్రేడ్ పండితులు చెప్పుకొస్తున్నారు.

Exit mobile version