యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తొలి బాలీవుడ్ చిత్రం “ఆదిపురుష్”. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటోంది. అయితే ఈ సినిమాలోని ఓ హైలెట్ సన్నివేశం కోసం నిర్మాతలు కోట్లు కుమ్మరిస్తున్నారట. “ఆదిపురుష్” సినిమాలో పూర్తిగా వీఎఫ్‌ఎక్స్‌తో కూడిన ఓ ఫారెస్ట్ సీన్ ఉందనే టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రానికి ఇది ప్రధాన హైలైట్ అని, మేకర్స్ ఈ సన్నివేశాల కోసం ఏకంగా 60 కోట్లు ఖర్చు చేసినట్లు సినిమా వర్గాలు చెబుతున్నాయి. దీంతో సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. సినిమా ప్రొడక్షన్‌తో పాటు, పోస్ట్ ప్రొడక్షన్‌కు చాలా సమయం వెచ్చించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇందులో ఎక్కువగా CGI, VFX పవర్క్ ఉంటుంది. క్లైమాక్స్ ను తెరకెక్కించడానికి వివిధ దేశాలకు చెందిన 50కి పైగా కంపెనీలు పని చేస్తున్నట్లు సమాచారం.
Read Also : Vishal : యాక్షన్ సీక్వెన్స్ లో తీవ్ర గాయం… షూటింగ్ వాయిదా
“ఆదిపురుష్” ఈ ఏడాది ఆగష్టు 11న విడుదల కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. భారత ఇతిహాసం రామాయణం ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయ్యింది. ఈ సినిమాలో ప్రభాస్‌ని రాముడిగా చూడాలని అభిమానులు తహతహలాడుతున్నారు. కృతి సనన్ సీతాదేవిగా కనిపించనుండగా, సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలో కనిపించనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని అంతర్జాతీయ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. భూషణ్ కుమార్ T-సిరీస్ అంతర్జాతీయంగా సిఎంమాను విడుదల చేయడానికి వాల్ట్ డిస్నీతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. తాన్హాజీ ఫేమ్ ఓం రౌత్ ఈ చిత్రానికి దర్శకుడు.