Adipurush First Ever Benefit Show at Prasads Hyderabad: తెలంగాణలో ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది సౌత్ ఇండియాలోని లీడింగ్ ఈవెంట్ మెంజ్మెంట్ కంపెనీ శ్రేయాస్ మీడియా. అదేమంటే రేపు తెల్లవారుజామున ‘ఆదిపురుష్’ సినిమా బెనిఫిట్ షోలు శ్రేయాస్ మీడియా సంస్థ ప్రదర్శిస్తోంది. ఒకటి కాదు రెండు కాదు ప్రసాద్ ఐమాక్స్ లో ఉన్న ఆరు స్క్రీన్స్ లో ఈ ఆదిపురుష్ సినిమాను బెనిఫిట్ షోగా వేస్తున్నట్టు ప్రకటించింది. 3:56 నిముషాలకు పూజ ఉంటుందని ఆ తరువాత నాలుగు గంటలకే షోలు ఉంటాయని ప్రకటించింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఇదే మొదటి బెనిఫిట్ షో అని పేర్కొంది.
Adipurush: మోస్ట్ ట్రోల్డ్ సినిమా నుండి మోస్ట్ అవైటెడ్ సినిమా వరకు.. ఆదిపురుష్ సక్సెస్
నిజానికి ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ విడుదల చేస్తున్నా నైజాం హక్కులు మాత్రం మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ కొనుగోలు చేసింది. అయితే మరోపక్క ఏపీలో మాత్రం బెనిఫిట్/స్పెషల్ షోలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వ లేదు. దీంతో ఏపీలో ఉన్న సింగిల్ థియేటర్లలో రోజుకి ఐదు షోలు మాత్రమే ప్రదర్శితమవనున్నాయి. తెలంగాణలో మొదటి మూడు రోజుల పాటు ఉదయం 3.30 గంటలకు తొలి ఆట మొదలైపోతుంది. ఒక పక్క హిందీ బెల్ట్ లో ఈ సినిమాకు బుకింగ్స్ షాక్ ఇచ్చేలా ముందుకు సాగుతున్నాయి. ఇక తెలుగు వెర్షన్‌కు సంబంధించి కూడా సింగిల్ స్క్రీన్స్ తో పాటు మల్టీప్లెక్సుల్లో బుకింగ్స్ కూడా ఒక రేంజ్ లో ఉన్నాయి. ఇక మరీ ముఖ్యంగా హైదరాబాద్‌లో మొదటి రోజు 3డీ షోలు అన్నీ ఫుల్ అయిపోయాయి. మల్టీప్లెక్సుల్లో అస్సలు ఖాళీ లేకపోగా సింగిల్ థియేటర్లలో ఒకటీ ఆరా సీట్లు ఖాళీ ఉన్నాయి.