బాహుబలి సినిమాతో పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర టాప్ చైర్‌లో కూర్చున్నాడు ప్రభాస్. ఆ తర్వత సాహో, రాధే శ్యామ్ సినిమాలు ఫ్లాప్ అయిపోయాయి. అయితే ఏంటి? ప్రభాస్ క్రేజ్ ఇసుమంత కూడా తగ్గలేదు కదా ఆకాశాన్ని తాకే అంతగా పెరిగింది. ప్రభాస్ అప్ కమింగ్ మూవీస్‌తో బాక్సాఫీస్ రికార్డులన్నీ మారిపోనున్నాయి. బాహుబలిలో రాజుగా అదరగొట్టిన ప్రభాస్.. ఇప్పుడు రాముడిగా రాబోతున్నాడు. ఇప్పటికే ఆదిపురుష్ ట్రైలర్, సాంగ్స్ హైప్‌ని నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లాయి. ముఖ్యంగా జై శ్రీరామ్ సాంగ్ గూస్ బంప్స్ తెప్పించింది. ఇక రీసెంట్‌గా వచ్చిన సెకండ్ సింగిల్ ‘రామ్ సీతా రామ్’ విజువల్స్ పరంగా అద్భుతం అనిపించుకుంది. ప్రస్తుతం ఈ సాంగ్ ట్రెండింగ్‌లో ఉంది. ముఖ్యంగా హిందీలో మిలియన్స్ ఆఫ్ వ్యూస్‌తో దూసుకు పోతుంది. దాంతో రిలీజ్ టైం దగ్గర పడుతున్న కొద్ది… ఆదిపురుష్ పై అంచనాలు పీక్స్‌కు వెళ్లిపోతున్నాయి. అందుకు తగ్గట్టే జూన్ 6న తిరుపతిలో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఇక ఈ సినిమాను రికార్డ్ స్థాయిలో.. అనేక భాషల్లో భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. దాంతో ఫస్ట్ డే ఓపెనింగ్ కలెక్షన్లపై ఊహించని విధంగా అంచనాలు నెలకొన్నాయి. ట్రేడ్ వర్గాల ప్రకారం.. ఆదిపురుష్ డే వన్ 100 కోట్లు కాదు.. 200 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లు రాబట్టవచ్చని అంచనా వేస్తున్నారు. ఇక మౌత్ టాక్ ఏ మాత్రం బాగున్నా.. ఆదిపురుష్ రోజుకో వంద కోట్లు ఈజీగా కొల్లగొడుతుందనడంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. వీకెండ్‌లోనే ఈ సినిమా దాదాపు 500 కోట్ల వరకు రాబడుతుందని అంటున్నారు. ఫస్ట్ వీక్ కంప్లీట్ అయ్యే లోపు ఆదిపురుష్ సినిమా వెయ్యి కోట్లు రాబట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. మొత్తంగా జూన్ 16న బాక్సాఫీస్ దగ్గర విధ్వంసం జరగడం పక్కా అని చెప్పొచ్చు.
