Adi Reddy Remuneration For Bigg Boss: ఒక కామన్ మ్యాన్ నుంచి రివ్యూయర్‌గా, రివ్యూయర్ నుంచి బిగ్‌బాస్ కంటెస్టంట్‌గా ఎదిగిన ఆది రెడ్డి.. బిగ్‌బాస్ సీజన్ 6లో థర్డ్ రన్నరప్‌గా నిలిచిన సంగతి అందరికీ తెలిసిందే! బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి.. తనదైన వ్యూహాలు, గేమింగ్ టాలెంట్‌తో ప్రేక్షకుల మనసు దోచి, చివరి వరకు షోలో కొనసాగాడు. అక్కడక్కడ కొన్ని తప్పిదాలు చేసినప్పటికీ.. అతని ఆటతీరు ఆడియన్స్‌కు బాగా నచ్చడంతో, థర్డ్ రన్నరప్ వరకూ తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ షో ముగిసిన నేపథ్యంలో.. ఆదిరెడ్డి హౌస్‌లో ఉన్న 15 వారాలకు గాను ఎంత పారితోషికం తీసుకున్నాడు? అనేది హాట్ టాపిక్‌గా మారింది.
NTR30: ఫ్యాన్స్‌కి ‘పండగ’లాంటి వార్త.. సెట్స్ మీదకి వెళ్లేది అప్పుడే!
హౌస్‌లో ఉన్నప్పుడు తాను బిగ్‌బాస్ షోలో ఉన్న కంటెస్టంట్ల కంటే.. యూట్యూబ్ ద్వారానే ఎక్కువ సంపాదిస్తానని ఓసారి ఆదిరెడ్డి పేర్కొన్నాడు. అలాగే.. ఓ ఇంటర్వ్యూలో షానీ సైతం ఒక సినిమాకి స్టార్ హీరోయిన్ తీసుకునే పారితోషికం, తన నెల సంపాదనతో సమానమని స్వయంగా ఆదిరెడ్డే చెప్పినట్టు తెలిపాడు. ఈ లెక్కన.. బిగ్‌బాస్ నిర్వాహకులు ఆదిరెడ్డికి భారీ మొత్తమే ఇచ్చి ఉంటారని అందరూ అనుకోవచ్చు. కానీ, అంత భారీ రెమ్యునరేషన్ అయితే అతని దక్కలేదని తెలుస్తోంది. ఇన్‌సైడ్ న్యూస్ ప్రకారం.. మొత్తం 15 వారాలకి గాను ఆదిరెడ్డి రూ. 12 లక్షల పారితోషికం అందుకున్నాడట! ఈ లెక్కన.. వారానికి రూ. 80 వేలు చొప్పున ఆదిరెడ్డి రెమ్యునరేషన్ తీసుకున్నాడన్నమాట!
Chinmayi Sripada: చిన్మయి మరో బాంబ్.. ఆయన మంచోడు కాదు
ఒకరకంగా చూసుకుంటే.. ఆది రెడ్డి యూట్యూబ్ సంపాదన కంటే ఇది చాలా అంటే చాలా తక్కువ! మరి, అంత తక్కువ అమౌంట్‌కి అతను ఎలా ఒప్పుకున్నాడు? అనే సందేహం రాకమానదు. ఇందుకు కూడా ఆదిరెడ్డి బదులిచ్చాడు. తాను డబ్బుల కోసం బిగ్‌బాస్‌కి రాలేదని, ఆ బిగ్‌బాస్ జర్నీని ఆస్వాదించడానికి వచ్చానని పేర్కొన్నాడు. యూట్యూబ్ ద్వారా కేవలం సోషల్ మీడియా వరకే పరిమితం అయిన ఆదిరెడ్డి.. ఇప్పుడు ఈ షో ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు దగ్గరయ్యాడుగా! అదన్నమాట సంగతి!