NTV Telugu Site icon

Bigg Boss 6: ఈ వారం హౌస్ నుంచి రివ్యూవర్ అవుట్..?

Adi Reddy

Adi Reddy

Bigg Boss 6: బిగ్ బాస్-6 తెలుగు సీజన్ చప్పగా సాగుతోంది. గతంలో ఉన్న పోటీ ప్రస్తుతం కనిపించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. హౌస్‌లో ఎవరూ సీరియస్‌గా ఆడటం లేదు. ఇప్పటికే గతవారం బిగ్‌బాస్ కెప్టెన్సీ టాస్క్ రద్దు కూడా చేశాడు. కనీసం నామినేషన్స్‌లో ఉంటే అయినా పోటీగా ఆడతారని భావిస్తూ ప్రతివారం ఎక్కువ మంది కంటెస్టెంట్లను బిగ్‌బాస్ నామినేషన్‌లో ఉంచుతున్నాడు. 8వ వారం ఏకంగా 13 మంది నామినేషన్స్‌లో ఉన్నారు. ఆదిరెడ్డి, గీతూ, బాలాదిత్య, రేవంత్, శ్రీహాన్, రాజ్, ఫైమా, శ్రీసత్య, సూర్య, వాసంతి, రోహిత్, మెరీనా, కీర్తి భట్ ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నారు. అయితే ఓటింగ్ ట్రెండ్‌ను చూసుకుంటే రేవంత్‌కు అత్యధిక ఓట్లు పడుతున్నాయి. ఈ జాబితాలో రెండో స్థానంలో శ్రీహాన్ ఉన్నాడు. 35 శాతం ఓట్లు వీళ్లిద్దరికే పడుతున్నాయి.

Read Also: Yash: బ్రహ్మాస్త్ర 2 లో యష్..?

అటు ఓటింగ్‌లో మూడో స్థానంలో మెరీనా ఉండటం విశేషం. గతవారం చివరిస్థానంలో ఉన్న ఆమె ఈ వారం అనూహ్యంగా మూడో స్థానానికి దూసుకొచ్చింది. గీతూ నాలుగో స్థానానికి పరిమితమైంది. కీర్తి ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాత వరుస స్థానాల్లో ఫైమా, ఇనయా, వాసంతి, రోహిత్, శ్రీసత్య ఉన్నారు. అయితే వీళ్లందరి మధ్య పెద్దగా తేడా లేదు. దీంతో వీరి స్థానాలు మారుతూ ఉన్నాయి. విచిత్రం ఏంటంటే గత వారం వరకు టాప్-5లో ఉన్న సూర్య ఈ వారం అట్టడుగు స్థాయికి పడిపోయాడు. సూర్య, బాలాదిత్య, ఆదిరెడ్డి, రాజ్ ప్రస్తుతానికి డేంజర్ జోన్‌లో ఉన్నారు. అయితే ఈ వారం రివ్యూవర్ ఆదిరెడ్డి హౌస్ నుంచి వెళ్లిపోతాడనే సంకేతాలు అందుతున్నాయి. అతడు పెద్దగా టాస్కులు ఆడుతుంది లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. అటు ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వడంలో కూడా ఆదిరెడ్డి వీక్‌గా కనిపిస్తున్నాడు. మరి వీకెండ్ కల్లా ఓట్ల విషయంలో తేడాలు వస్తే తప్ప ఆదిరెడ్డి ఈ వారం హౌస్ నుంచి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.